అది 200ఏళ్ల నాటి రావి చెట్టు..! ప్రజలంతా దాన్ని ఓ దైవంలా భావిస్తారు. అయితే ఉన్నట్టుండి ఆ చెట్టుకు మంటలు అంటుకున్నాయి..
2/ 7
రావి చెట్టుకు మంటలు అంటుకోవడంతో ఫైర్ ఇంజిన్లు ఎంట్రీ ఇచ్చాయి.. మంటలు ఆర్పి వెళ్లిపోయాయి.. అయితే ఆ మంటలు మళ్లీ చెలరేగడం మొదలుపెట్టాయి.. ఇలా ఒకసారి కాదు.. రెండుసార్లు జరిగాంది.. ఎక్కడో తెలుసా..?
3/ 7
దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పార్లమెంటరీ నియోజకవర్గమైన ఫూల్ పూర్లోని తర్దిహ్ గ్రామంలోవింత ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామంలో సుమారు 200 సంవత్సరాల నాటి రావిచెట్టు ఉంది, దీనిని గ్రామస్తులు వీర్ బాబా పేరుతో పూజిస్తారు.
4/ 7
వారం రోజుల క్రితం ఈ చెట్టుకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
5/ 7
మంటలను ఆర్పిన తర్వాత మరుసటి రోజు మళ్లీ మంటలు చెలరేగాయి. గ్రామంలో మరోసారి ఫైర్ బెల్ మోగింది. రెండోసారి మంటలు ఆర్పేసిన తర్వాత కూడా మూడోసారి మంటలు చెలరేగాయి.
6/ 7
వీర్ బాబా ఏదో కోపంతో ఉన్నారని, ఆయన శాంతించే వరకు ఈ మంట మండుతూనే ఉంటుందని ప్రజలు చెబుతున్నారు.
7/ 7
చెట్టును ఆర్పేందుకు మూడు ట్యాంకర్ల నీటిని ఉపయోగిచారు ఫైర్ సిబ్బంది..అయినా మంటలు ఆరినట్లే ఆరి..మళ్లీ విజృంభిస్తున్నాయి.