Earthquake near Ayodhya: అయోధ్య సమీపంలో భూప్రకంపనలు.. పూర్తి వివరాలు
Earthquake near Ayodhya: అయోధ్య సమీపంలో భూప్రకంపనలు.. పూర్తి వివరాలు
Earthquake near ayodhya: అయోధ్య సమీప ప్రాంతాలను భూకంపం వణికించింది. అర్ధరాత్రి భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరి భూకంప తీవ్రత ఎంత? శాస్త్రవేత్తలు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
1/ 4
యూపీలోని అయోధ్య సమీపంలో భూప్రకంపనలు సంభవించాయి. గురువారం రాత్రి 11.59 నిమిషాల సమయంలో భూమి కంపించింది. ఆ సమయంలో అందరూ నిద్రలో ఉండడంతో దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
అయోధ్య పట్టణానికి ఉత్తర ఈశాన్య దిశగా 176 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై భూకం తీవ్రత 4.3గా నమోదయినట్లు వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
భూకంప కేంద్రం నేపాల్‌లో భూమి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ భూకంప ప్రభావంతో అయోధ్యలోనూ భూమి కంపించింది. స్వల్పంగానే కంపించడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఐతే ఉదయం టీవీల్లో చూసి జనం కంగారుపడ్డారు. భూకంపం వచ్చిందా? అని భయపడ్డారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
4.3 తీవ్రత అంటే స్వల్ప భూకంపమేనని.. దీని గురించి ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇలాంటివి చాలా కామన్‌గా వస్తుంటాయని పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)