The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఇప్పటికే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను తాజాగా దేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు ఝల్లు కురిపించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ను అభినందించారు. (Twitter/Photo)
ప్రస్తుతం ‘ది కశ్మీర్ ఫైల్స్’ దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న సినిమా. ఈ చిత్రానికీ రోజు రోజుకు పాజిటివ్ రెస్పాన్స్ పెరుగుతోంది. ది కాశ్మీర్ ఫైల్స్’ 90వ దశకంలో కశ్మీర్లో జరిగిన దారుణ హింసాకాండాను ఉన్నది ఉన్నట్లు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కళ్లకు కట్టినట్టు చూపించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాపై ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న నేతలు బాగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చాయి. తాజాగా యూపీ సీఎం యోగీ ప్రభుత్వం కూడా ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చింది. (Twitter/Photo)
ఈ సందర్భంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా టీమ్ మెంబర్స్‌కు అభినందించడంతో పాటు యూపీ సంబంధించిన మెమెంటోలను అందించారు. ఈ సినిమా విషయానికొస్తే.. మొదటి వారం ఈ సినిమా మన దేశంలో 561 స్క్రీన్స్‌లో విడుదలైంది. ఓవర్సీస్లో 113 స్క్రీన్స్‌లో మొత్తంగా 674 స్క్రీన్స్‌లో విడులైన ఈ సినిమా.. రెండో వారం వచ్చేసరికి 6 రెట్లకు పైగా 4000 పైగా స్క్రీన్స్‌లో ప్రదర్శితమవుతోందంటే ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ ఏ రేంజ్లో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎపుడో కానీ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి అద్భుతాలు జరగడం రేర్.. అలాంటి అద్భుతాన్ని ‘ది కశ్మీర్ ఫైల్స్’ చేసి చూపించింది. (Twitter/Photo)
ఈ సినిమా విషయానికొస్తే.. 1990 దశకంలో సుందర కశ్మీర్లో జరిగిన దారుణ మారణ హింసాకాండకు దృశ్య రూపంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఎంతో హృద్యంగా కళ్లకు కట్టినట్టు తెరకెక్కించారు. 90వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపంగా ఈ సినిమాకు తెరరూపమిచ్చారు. (Twitter/Photo)
కశ్మీర్ ఫైల్స్ ఏ ఒక్క క్షణం కూడా సినిమాలా అనిపించదు.. నాటి దురాగతానికి సాక్ష్యంగా కనిపిస్తుంది అనే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అందుకే థియేటర్స్‌లో కూడా ఎక్కువగా 60 ఏళ్లు దాటిన సీనియర్ ప్రేక్షకులే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు కనక వర్షం కురుస్తోంది. ఇక మొదటి రోజు కేవలం రూ. 3.55 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు నుంచి సంచలనం సృష్టిస్తుంది. రెండో రోజు 8.50 కోట్లు.. మూడో రోజు 15.50 కోట్లు.. నాలుగో రోజు 15.05 కోట్లు వసూలు చేసింది. ఐదు రోజు రూ. 18.02, ఆరో రోజు రూ. 19.05 కోట్లు.. ఏడో రోజు.. ఈ సినిమా రూ. 18.05 కోట్లు.. ఎనిమిదో రోజు హోళి పండగ నాడు.. రూ. 19.15 కోట్లు వసూళు చేస్తే 9వ రోజు శని వారం.. 24.80 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ట్రేడ్ పండితులను ఆశ్యర్య చకితులను చేస్తోంది. మొత్తంగా 9 రోజుల్లో 141.25 కోట్లు వసూళు చేసింది. ఆదివారం మరో రూ. 30 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలో రూ. 200 కోట్లను వచ్చే వారం వరకు క్రాస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ దేశానికి సంబంధించిన ముఖ్యనేతలు ప్రశంసలు దక్కడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.