Elections 2019: తల్లి గెలుపు కోసం బాలీవుడ్ తార ఎన్నికల ప్రచారం

యూపీలోని లక్నో లోక్‌సభ నియోజకవర్గ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున రాజ్‌నాథ్ సింగ్ బరిలో నిలుస్తుండగా...సమాజ్‌వాది పార్టీ తరఫున శతృఘ్న సిన్హ భార్య పూనమ్ సిన్హ గట్టి పోటీ చేస్తున్నారు. తల్లి పూనమ్ కోసం బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హ లక్నోలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్‌తో కలిసి ఆమె రోడ్ షోలో పాల్గొన్నారు.