కొన్ని గిరిజన తెగల్లో ఎక్కువ భూమి కలిగిన కుటుంబాల్లో పురుషులు లేదా స్త్రీలు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవడం చాలా కాలంపాటు కొనసాగింది. అయితే, పురుషాధిక్యభావజాలం విస్తరించినకొద్దీ స్వేచ్ఛా వివాహాల ఛాయిస్ పురుషులకే పరిమితమైపోయింది. ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ లోని పలు ప్రాంతాల్లో గిరిజన యువకులు ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకోవడం తరచూ వార్తల్లో నిలుస్తోంది.
బంధుమిత్రుల సమక్షంలో వరుడు ఆ ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడు. శుభలేఖలో వరుడి పేరు కింద వధువుల ఇద్దరూ పేర్లూ రాశారు. ఈ వివాహం చర్చనీయాంశంగా మారింది. ఆ వ్యక్తికి ముందు ఒక అమ్మాయిని నిశ్చితార్థం చేసుకొని ఇంటికి తీసుకొచ్చి, తల్లిని చేశాక, మరో అమ్మాయితో ప్రేమలో పడటం, ఆమె కూడా బిడ్డకు జన్మనివ్వడం, చివరికి పిల్లల సాక్షిగా వారు వివాహబందంలోకి అడుగుపెట్టడం అరుదైన దృశ్యంగా నిలిచింది.