UNIQUE CHERRY TOMATO SOLD FOR 400 TO 600 PER KILOGRAM IN INTERNATIONAL MARKET AMBIKA PATEL JABALPUR CHECK DETAILS SK
Cherry Tomato: కిలో టమోటా రూ.600.. ఎకరాకు రూ.కోటి వరకు ఆదాయం.. ఏంటి దీని ప్రత్యేకత?
Cherry Tomato Jabalpur: కిలో టమోటా రూ.600. అవును ఇది నిజం. దీని రేటు యాపిల్, దానిమ్మ కంటే ఎక్కువ. విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. మరి ఏంటీ టమోటా? దీని ప్రత్యేకత ఏంటి?
చెర్రీ టోమోటాలు రైతులకు కాసులు కురిపిస్తున్నాయి. ఒక్క కిలో టమోటా 400 నుంచి 600 వరు పలుకుతోంది. మన దేశంలో మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు రైతులు వీటిని సాగు చేస్తున్నారు. దుబాయ్, అమెరికాలకు ఎగుమతి చేస్తున్నారు.
2/ 8
జబల్పూర్లో అంబికా పటేల్ అనే రైతు చెర్రీ రకం టమోటాను సాగు చేస్తున్నారు. కొన్నేళ్లుగా వీటిని పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. చెర్రీ టమోటాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ట్రేలల్లో విత్తానాలు వేసి.. అవి మొలకెత్తిన తర్వాత పొలంలో నాటుతారు. డ్రిప్ పద్దతిలో పంటకు నీళ్లు పెడతారు.
3/ 8
సేంద్రియ పద్ధతిలో టమోటాలు పండించేందుకు అంబికా పటేల్ లోతైన పరిశోధన చేశారు. వివిధ రకాల టోమోటాలను అధ్యయనం చేసిన తర్వాత చిన్నగా ఉండే టమోటాలను ఎంచుకున్నాడు. వాటితో ఎన్నో ఉపయోగాలున్నాయని తెలిసి సాగు చేస్తున్నాడు.
4/ 8
దీనిని హైబ్రిడ్ టొమాటో అని, స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన అధిక విటమిన్-రిచ్ టొమాటో అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో పాలీహౌస్లో కూడా వీటిని పెంచవచ్చు. సాధారణంగా టమోటాల ఉత్పత్తి తగ్గినన్పుడు.. వీటిని బాగా వినియోగిస్తారు.
5/ 8
చెర్రీ టొమాటోలను పండించడం పెద్ద కష్టమైన పనేం కాదు. ట్రేలో లేదంటే భూమిపైన కూడా మొలుస్తాయి. తేమ ఎక్కువగా అవసరం ఉన్నందున.. డ్రిప్ పద్దతిలో నీరు పెడతారు. కానీ అన్ని పంటల్లా కాకుండా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సాగు చేయాల్సి ఉంటుంది.
6/ 8
పొలంలో మొక్కల దూరం 60 సెం.మీ ఉండాలి. వరుసల దూరం ఒకటిన్నర నుండి రెండు మీటర్ల వరకు ఉంచాలి. నాట్లు వేసిన వెంటనే నీటిని పారించాలి. విత్తనాల నుంచి మొదలు.. పంటను ఎగుమతి చేసే వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.
7/ 8
చెర్రీ టమోటాలను ద్రాక్షలాగా ప్యాకింగ్ చేస్తారు. ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేస్తారు గనుక జాగ్రత్తగా ఉండాలి. అది చేరే సమయానికి చెడిపోకుండా ప్యాకింగ్ చేస్తారు. చెర్రీ టమోటాలు పుల్లగా ఉంటాయి. విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బాగా డిమాండ్ ఉంటుంది.
8/ 8
పాలీ హౌస్‌లో ఒక ఎకరంలో 20 టన్నుల వరకు చెర్రీ టమోటాలు పండించవచ్చని అక్కడి రైతులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.600 వరకు పలుకుతోంది. రైతుకు కనీసం రూ.200 రేటు వచ్చినా.. ఎకరాకు అంటే మంచి రేటు పలికితే రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తుంది.