Petrol: దేశంలో 5 ఏళ్ల తరువాత పెట్రోల్ నిషేధం.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
Petrol: దేశంలో 5 ఏళ్ల తరువాత పెట్రోల్ నిషేధం.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
Petrol: రాబోయే ఐదేళ్లలో దేశంలో పెట్రోల్‌పై నిషేధం వస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దేశంలో అసలు పెట్రోల్ అవసరం ఉండదని అన్నారు.
దేశంలో పెట్రోల్‌ను నిషేధిస్తారంటే.. పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించలేం. అయితే రాబోయే ఐదేళ్లలో దేశంలో పెట్రోల్‌పై నిషేధం వస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దేశంలో అసలు పెట్రోల్ అవసరం ఉండదని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
గురువారం మహారాష్ట్రలోని అకోలాలోని డాక్టర్ పంజాబ్రావ్ దేశ్‌ముఖ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్న గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో దేశంలో పెట్రోలు నిషేధించనున్నట్లు ప్రకటించారు. (ఫైల్ ఫోటో)
3/ 5
విదర్భలో తయారైన బయో ఇథనాల్‌ను వాహనాల్లో వినియోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. బావి నీళ్లతో గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసి కిలో రూ.70కి విక్రయించవచ్చని అన్నారు. రానున్న ఐదేళ్లలో దేశంలో పెట్రోలు కరువవుతాయని అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
గోధుమలు, వరి, మొక్కజొన్న తదితర సంప్రదాయ పంటలు పండించినంత మాత్రాన రైతు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండదని, ఇప్పుడు రైతు ఏదో ఒకటి చేయాల్సిందేనని అన్నారు. రైతులు ఇప్పుడు శక్తి దాతలుగా, అన్నదాతలుగా మారాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఇథనాల్‌పై తీసుకున్న నిర్ణయం వల్ల దేశానికి రూ.20,000 కోట్లు ఆదా అయిందని గడ్కరీ అన్నారు. సమీప భవిష్యత్తులో ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్, CNG ఆధారంగా ఉంటాయని తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)