కేంద్ర బడ్జెట్ 2019 : బడ్జెట్లో కీలక అంశాలు ఇవే..
కేంద్ర బడ్జెట్ 2019 : బడ్జెట్లో కీలక అంశాలు ఇవే..
బడ్జెట్ అంటే దేశ ఆదాయం, ఖర్చుల లెక్కలకు సంబంధించిన ఓ డ్రాఫ్ట్. ఒక ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం వేసుకునే ప్రణాళిక. ఏ పథకానికి ఎంత కేటాయించాలి..? ఎక్కడెంత పన్ను బాదాలి..? వంటి లెక్కలన్నీ ఇందులోకే వస్తాయి. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశంలో పూర్తి స్థాయి ఆర్థిక మంత్రి హోదాలో ఒక మహిళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. తాజా బడ్జెట్లో సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు...