union budget 2019 India : కేంద్ర బడ్జెట్‌లో ఇవే కీలకాంశాలు

union budget 2019 : 27 లక్షల కోట్లతో భారీ వ్యయంతో పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్నివర్గాలనూ సంతృప్తిపరచడమే లక్ష్యంగా పద్దును రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగ, కార్మిక, కర్షక రంగాలకు.. పేద, మధ్యతరగతి వర్గాలపై వరాల జట్టు కురిపించింది.