HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
UK VIRUS WHAT IS THE NEW CORONA VARIANT IN UK WHAT EXPERTS SAY HERE IS THE FULL DETAILS ABOUT IT AND ITS TRANSMISSION NK GH
UK Virus: కొత్త కరోనా వైరస్‌తో తీవ్ర పరిణామాలు ఉంటాయా? పరిశోధకులు ఏమంటున్నారు?
New corona variant in UK: బ్రిటన్‌లో వచ్చిన వైరస్ వార్తలతో మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? ఆ కొత్త వైరస్ ఇండియాలో ప్రమాదకరంగా మారుతుందా? దాన్ని ఎదుర్కొనే సత్తా ప్రస్తుత వ్యాక్సిన్లకు ఉందా?
News18 Telugu | December 22, 2020, 2:32 PM IST
1/ 7
Britain CoronaVirus: కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యేలా కనిపించట్లేదు. ఈ వైరస్‌పై సంవత్సరం నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఏ వైరస్‌పైనా ఇంత ఎక్కువగా పరిశోధనలు జరగలేదు. అయినప్పటికీ ఈ వైరస్ ఎలాంటిదో ఇంకా అర్థం కాలేదు. వైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ప్రపంచ దేశాలు, టీకా పంపిణీ కూడా మొదలుపెట్టాయి. అమెరికా, బ్రిటన్‌లో వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతులు ఇవ్వడంతో... అత్యవసరంగా వాడుతున్నారు. ఈ మహమ్మారిని కొన్ని నెలల్లో పూర్తిగా అంతం చేయవచ్చు అనుకునేలోపే మరో చేదు వార్త ప్రజలకు భయభ్రాంతులు కలిగిస్తోంది. ఇప్పటికే ఎన్నోరకాలుగా తన రూపు మార్చుకున్న కరోనా వైరస్... మరోసారి తీవ్రమైన నష్టాలను కలుగజేసేలా కనిపిస్తోంది. బ్రిటన్, ఇతర ఐరోపా దేశాల్లో వెలుగుచూసిన కొత్త వైరస్ స్ట్రెయిన్ (రూపం కొద్దిగా మార్చుకున్న వైరస్) పాత వైరస్‌తో పోలిస్తే వేగంగా వ్యాపిస్తోందని అధికారులు చెబుతున్నారు. (image credit - NIAID)
2/ 7
ఇండియాలోనూ వ్యాప్తి?: ఈ కొత్త వైరస్ భారత్‌కు కూడా వచ్చేసిందని తెలుస్తోంది. లండన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో... ఢిల్లీలో ఐదుగురు, చెన్నైలో ఒకరికి ఈ కొత్త కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని తెలుస్తోంది. నిన్న రాత్రి లండన్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న 266 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ ఉంది. కరోనా సోకినవారి శాంపిల్స్‌ను పరిశోధన కోసం NCDC (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్)కి పంపించారు. లండన్ నుంచి ఢిల్లీ మీదుగా చెన్నై వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. చెన్నైలో లండన్ నుంచి వచ్చిన మరో 14 మంది ప్రయాణికులను పరిశీలనలో ఉంచారు అధికారులు. లండన్‌తో ప్రయాణ సంబంధం ఉన్న 1088 మందిని గుర్తించి పర్యవేక్షిస్తున్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. (image credit - twitter - reuters)
3/ 7
రూపంలో మార్పులు: కరోనా మహమ్మారి అన్ని ప్రపంచదేశాలకూ వ్యాపించింది. కోవిడ్-19కు కారణమవుతున్న సార్స్-కోవ్ -2 వైరస్ ఇప్పటికే 4,000 రకాలుగా రూపాంతరం చెందింది. ఈ రకాలేవీ అంత ప్రమాదకరంగా మారలేదు. వీటితో పోలిస్తే ప్రస్తుతం బ్రిటన్‌లో బయటపడిన కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ (Mutated Virus) వేగంగా వ్యాపిస్తూ, ప్రమాదకరంగా మారుతోంది. దీని వ్యాప్తి, ప్రమాద తీవ్రత గురించి మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు బ్రిటన్‌లో మరోసారి లాక్డౌన్ విధించారు. కొత్త వైరస్ వేరియంట్‌కు దూరంగా ఉండేందుకు ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. బ్రిటన్ నుంచి వచ్చే రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి. (image credit - twitter - reuters)
4/ 7
వ్యాప్తి ఎక్కువ: పాత వైరస్‌తో పోలిస్తే.. కొత్త వేరియంట్ వ్యాప్తి 70 శాతం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక సమాచారం లేదు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఆధారంగానే కొత్త వైరస్ వ్యాప్తిపై వైద్యులు అంచనాకు వస్తున్నారు. ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడం వల్ల అధికారులు కారణాలు అన్వేషించారు. దీంతో అక్కడి రోగుల్లో కొత్త వైరస్ స్ట్రెయిన్ ఉన్నట్లు బయటపడింది. గతంలో ఎక్కువ ప్రభావం చూపిన D614G వైరస్ వేరియంట్ వల్ల కూడా అమెరికా, యూరప్ దేశాల్లో వైరస్ వ్యాప్తి పెరిగింది. కానీ దీని వ్యాప్తి మరీ ఎక్కువగా లేదని నిపుణులు తేల్చారు. దీన్ని బట్టి చూస్తే ఈ కొత్త వేరియంట్ కూడా మరీ అంత ప్రమాదకారి కాదని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. (image credit - twitter - reuters)
5/ 7
ప్రమాద తీవ్రతపై అనుమానాలు: కొత్త వైరస్ స్ట్రెయిన్ తీవ్రతను అంచనా వేసేందుకు సరిపోయేంత డేటా లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఇది బయటపడి కొన్నాళ్లే అవుతోంది. దీని ప్రభావంతో ఎంతమైది హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నారు, ఎంతమంది కోలుకున్నారు, ఎంతమంది చనిపోయారనే వివరాలు తెలిసిన తరువాతే కొత్త స్ట్రెయిన్ తీవ్రతను డాక్టర్లు అంచనా వేయగలుగుతారు. దీనిపై మరిన్ని పరిశోధలు జరగాల్సి ఉంది. అప్పటి వరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ బారిన పడకుండా కాపాడుకోవడం తప్ప వేరే మార్గం లేదు. (image credit - twitter - reuters)
6/ 7
వ్యాక్సిన్ ఎలా?: వ్యాక్సిన్ డెవలపర్లు వీలైనంత త్వరగా ఈ కొత్త వేరియంట్‌పై పరిశోధనలు చేయాల్సి ఉంది. ఈ విషయంలో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని కంపెనీలు చెబుతున్నాయి. ఫైజర్-బయో ఎన్ టెక్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలు అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేశాయి. దీని ద్వారా వైరస్ మ్యుటేషన్, కొత్త వైరస్ వ్యాక్సిన్లపై వేగంగా పరిశోధనలు జరగనున్నాయి. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే కొత్త వేరియంట్ వ్యాక్సిన్ కోసం పరిశోధనలు సైతం మొదలుపెట్టింది. (image credit - twitter - reuters)
7/ 7
అప్రమత్తత అవసరం: ఇతర దేశాలకంటే బ్రిటన్‌లో వైరస్ జన్యుపరంగా ఎక్కువగా మార్పు చెందింది. మొదటి నుంచి యూరప్ దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగానే ఉంది. మొదట్లో లాక్డౌన్ సడలించిన తరువాత అక్కడ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి కూడా పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో మరోసారి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన నష్టాలను కలిగించకముందే కరోనా కొత్త స్ట్రెయిన్‌పై ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. (image credit - twitter)