Diwali Gift : దీపావళి బహుమతిగా రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితం .. CNG, PNGపై వ్యాట్ కూడా తగ్గింపు ..ఎంత శాతం అంటే
Diwali Gift : దీపావళి బహుమతిగా రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితం .. CNG, PNGపై వ్యాట్ కూడా తగ్గింపు ..ఎంత శాతం అంటే
Diwali Gift: గుజరాత్ ప్రజలకు బీజేపీ సర్కారు దీపావళి పండుగ సందర్భంగా కానుక ప్రకటించింది. రాష్ట్రంలోని ఉజ్వల్ పథకం లబ్ధిదారులకు ఏడాదిలో రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయనున్నట్లుగా ప్రకటించింది.
గుజరాత్ ప్రజలకు బీజేపీ సర్కారు దీపావళి పండుగ సందర్భంగా కానుక ప్రకటించింది. రాష్ట్రంలోని ఉజ్వల్ పథకం లబ్ధిదారులకు ఏడాదిలో రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయనున్నట్లుగా ప్రకటించింది. (FILE PHOTO)
2/ 8
గుజరాత్‌లోని 38లక్షల మంది గృహిణులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ రాష్ట్ర మంత్రి వఘాని తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలోని మహిళలకు వెయ్యి కోట్ల రూపాయల లబ్ది జరగనుంది. (FILE PHOTO)
3/ 8
మరోవైపు సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్లపైనా 10శాతం వ్యాట్‌ను తగ్గించనున్నట్లుగా గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. దీని వల్ల ఒక కేజీ సీఎన్జీపై ఆరు నుంచి 7రూపాయలు తగ్గే అవకాశం ఉంది. (FILE PHOTO)
4/ 8
అలాగే పీఎన్జీ గ్యాస్‌పైన కూడా ఐదు రూపాయల నుంచి 5.5రూపాయల వరకు తగ్గనుందని గుజరాత్ విద్యాశాఖ మంత్రి వఘాని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి సందర్బంగా ప్రభుత్వం ఇస్తున్న కానుకలు ఇవేనని సమాధానమిచ్చారు. (FILE PHOTO)
5/ 8
రెండు గ్యాస్ సిలిండర్ల ఆఫర్ రాష్ట్రంలోని ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులందరికి వర్తిస్తుందని ప్రకటించారు. రిఫండ్ మొత్తం డైరెక్టుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని పేర్కొన్నారు.(FILE PHOTO)
6/ 8
రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా ప్రకటించిన బతుమతులు రాజకీయ లబ్ది కోసమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. త్వరలో గుజరాత్ ఎన్నికలు ఉన్నందున ఓటర్లను ఈవిధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. (FILE PHOTO)
7/ 8
ఒక్క గుజరాత్‌లోనే ఈ విధంగా దీపావళి కానుకలు ఇవ్వాలి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం విపక్షాలు అనేవి ఇలాంటి విమర్శలు చేయడం కామన్ అంటూ కొట్టిపారేస్తున్నారు. (FILE PHOTO)
8/ 8
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉజ్వల స్కీమ్ కింద కనెక్షన్ తీసుకున్న వారికి రూ. 200 సబ్సిడీ అందిస్తామని ప్రకటించింది. అంటే ఉజ్వల గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే సిలిండర్‌పై రూ. 200 బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. అంటే అప్పుడు సిలిండర్ రూ. 850కే లభించినట్లు అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)