ముంబైలో భారీ వర్షాలకు రెండు భవనాలు కుప్పకూలాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ భవనాలు కూలాయి. దక్షిణ ముంబైలోని ఓ ఆరు అంతస్తుల భవనం పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనలో శిధిలాల కింద కొందరు చిక్కుకుపోయినట్టు అధికారులు తెలిపారు. నాలుగు ఫైరింజన్లలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు. మరో ఘటనలో మాల్వానీ ప్రాంతంలో మూడు అంతస్తుల భవనంలో ఒక భాగం కూలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. చాలా మంది భవనాల కింద చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఐదు నుంచి ఆరుగురు శిథిలాల కింద ఉండొచ్చని అధికారులు చెప్పారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. వర్షాలకు భవనం కూలిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే వర్షాలకు భవనం కూలిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే వర్షాలకు భవనం కూలిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే వర్షాలకు భవనం కూలిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే