ఇకనుంచి ముంబై మెట్రోల్లో ప్రయాణించడానికి అక్కడి వారంతా రకరకాల కార్డులను తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. అన్ని అవసరాలను ఈ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు తీర్చనుంది. ఈ ట్రావెల్ స్మార్ట్ కార్డు వాడకాన్ని ముంబైలో ప్రారంభించడం ద్వారా అక్కడ మెట్రోల్లో కాంటాక్ట్ లెస్ లావాదేవీలు సులభం అవుతాయి. ఈ కార్డును ఒక్క మెట్రోల్లోనే కాదు బస్సులు, లోకల్ రైళ్లు, ఇతర ప్రజా రవాణాల్లోనూ వాడేందుకు వీలవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు అంటే? : ట్రావెలింగ్లోని అవసరాలను తీర్చడానికి ఈ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు(NCMC)ను కేంద్ర ప్రభుత్వం 2019, మార్చి 4న తీసుకొచ్చింది. ఇది ఇంటర్ సిస్టం ట్రాన్స్పోర్ట్ కార్డు. ఈ కార్డు ద్వారా లావాదేవీలు జరపాలంటే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ. 2000 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. వంద, రెండు వందలు, మూడు వందలు.. ఇలా మాత్రమే రీఛార్జ్ చేసుకునే వీలుంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
నేషనల్ మొబిలిటీ కార్డుతో ప్రజలు ప్రయాణాలు, టోల్ ట్యాక్స్, రిటైల్ షాపింగ్ కోసం డబ్బులు చెల్లించవచ్చు. అంతేకాకుండా వారు NCMCతో డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా ఉంది. మెట్రో కార్పొరేషన్, బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్ బస్సు సర్వీసులు, కదంబ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (కెటిసి) బస్సు సర్వీసులు, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రజా రవాణాలో ప్రజలు NCMCని ట్రావెల్ స్మార్ట్ కార్డ్ ఉపయోగించవచ్చు. తాజాగా ముంబై నగరంలోని మెట్రోలను కూడా ఈ నెట్‌వర్క్‌లోకి తీసుకుంది.ఈ సేవలను ప్రధాని నేడు ప్రారంభించనున్నారు.
మోదీ ముంబై పర్యటన : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ముంబైలో పర్యటించనున్నారు. దీంతో ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్లు, పారా గ్లైడింగ్, రిమోట్‌తో పని చేసే మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు.. లాంటి వాటికి ముంబైలోని బీకేసీ సమీప ప్రాంతాల్లో అనుమతులు లేవని పోలీసులు చెప్పారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, పట్టణ ప్రయాణాలను సులభతరం చేయడం, ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడం లక్ష్యంగా రూ. 38,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
బాంద్రా కుర్లా కాంప్లెక్స్(BKC)లోని MMRDA మైదానంలో జరిగే కార్యక్రమంలో ఏడు మురుగునీటి శుద్ధి కర్మాగారాలను మెదీ ప్రారంభిస్తారు. రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.12,600 కోట్ల విలువైన ముంబై మెట్రో రైల్ 2A, 7 లైన్లను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఆయన కూడా మెట్రో రైలులో ప్రయాణిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)