థర్డ్ ప్లేస్లో నిలిచిన బ్రాండ్ ఆఫీసర్స్ చాయిస్. ఈ బ్రాండ్ విస్కీ కరోనాకు ముందు కనక వర్షం కురిపించింది. ఆతర్వాత సేల్స్ క్రమంగా తగ్గుతూ వచ్చినప్పటికి థర్డ్ ప్లేసులో నిలవడం గొప్ప విషయంగానే చూడాలి. 2021లో 23.2 మిలియన్ కేసులు అమ్ముడైతే 2020లో 20.8 మిలియన్ కేసులు తాగేశారు మందుబాబులు. (ప్రతీకాత్మకచిత్రం)
నాల్గో స్థానంలో ఉన్న విస్కీ బ్రాండ్ రాయల్ స్టాగ్. ఈ బ్రాండ్ మద్యం సేల్స్ చూస్తే కరోనా ముందు ఉన్న రికార్డులను క్రాస్ చేసింది. ఒక్క 2021 సంవత్సరంలోనే 22.4 మిలియన్ కేసులు విక్రయించారు. పెర్నాడ్ రికార్డ్ బ్రాండ్ అయిన రాయల్ స్టాగ్ 2020లో 18.5 మిలియన్ కేసులను విక్రయించినట్లుగా తెలుస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పదవస్థానంలో ఉన్న విస్కీ బ్రాండ్ ఓల్డ్ టావెర్న్. దీన్ని యునైటెడ్ స్పిరిట్స్ ఉత్పత్తి చేస్తోంది. 2021లో 4.4 మిలియన్ కేసుల చొప్పున అమ్మకాలను నమోదు చేసింది. 2020లో 4.5 మిలియన్ కేసులను తాగేశారు మద్యం ప్రియులు. భారత్లో సేల్స్ జరిగిన టాప్ టెన్ విస్కీ బ్రాండ్లలో సగం బ్రాండ్లు యునైటెడ్ స్పిరిట్స్ కు చెందినవి కావడం విశేషంగా చూడాలి. (ప్రతీకాత్మకచిత్రం)