అసెంబ్లీ ఎన్నికలు: ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికలకు ముందు సంవత్సరం కావడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగాయి. మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం వచ్చింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి పవర్లోకి వచ్చింది. మిజోరాంలో ఎంజేఎఫ్ అధికారాన్ని చేజిక్కించుకుంది.