దేశంలోనే 30 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ లలో ప్రత్యూష కూడా ఒకరు. ఆమె బంజారా హిల్స్ లోని తన నివాసంలో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె బాత్రూంలో బొగ్గులు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె సినిమా ప్రముఖులకు డిజైనర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె బంజారా హిల్స్ లో బోటిక్ ను నడుపుతున్నారు.
ప్రత్యూష గదికి దగ్గరగా బొగ్గులను కాల్చారు. దీంతో ఆమె గది అంతా కార్బన్‌మోనాక్సైడ్ వాయువుతో నిండిపోయింది. ఈ వాయువు పీల్చడం వలన ప్రత్యూష చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా, ప్రత్యూష ఫేమస్ హీరో హీరోయిన్ లకు పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఆమె ఈ విధంగా విగత జీవిగా మారడం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదంగా మారింది.
ప్రత్యూష ఇంటి నుంచి పొగలు రావడాన్ని ఇంటి చుట్టు పక్కల వారు గమనించారు. వెంటనే గదిలో వెళ్లి చూశారు. అక్కడ ఆమె విగత జీవిగా పడి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమె మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసుకున్నారు. ప్రత్యూష కార్బన్‌మోనాక్సైడ్ గాలి పీల్చుకుని చనిపోయినట్లు తెలుస్తోంది.
ఇంతటి ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య చేసుకొవడం వెనుక కారణం ఏమై ఉండవచ్చని పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబంలో ఏమైన సమస్యలు ఉన్నాయా లేదా ఆమె ఒక్కతే బంజారా హిల్స్ లో ఉంటున్నారు. ప్రేమ వ్యవహారం ఆమె చనిపోవడానికి కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఏది ఏమైన విశ్వ నగరం హైదరాబాద్ మరోసారి ఈ ఘటనతో వార్తలలో నిలిచింది.