SS Rajamouli: ఎన్నికల ప్రచారకర్తగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్..ఎస్ఎస్ రాజమౌళి భుజాలపై మరో బాధ్యత
SS Rajamouli: ఎన్నికల ప్రచారకర్తగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్..ఎస్ఎస్ రాజమౌళి భుజాలపై మరో బాధ్యత
SS Rajamouli: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి మరో బృహత్తరమైన బాధ్యతలు అప్పగించనుంది కర్నాటక రాష్ట్ర ఎన్నికల కమిషన్. ట్రిపులార్ సినిమాతో యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న రాజమౌళి ఎన్నికల ప్రచారకర్తగా వ్యవహరించబోతున్నారు.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి మరో బృహత్తరమైన బాధ్యతలు అప్పగించనుంది కర్నాటక రాష్ట్ర ఎన్నికల కమిషన్. ట్రిపులార్ సినిమాతో యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న రాజమౌళి ఎన్నికల ప్రచారకర్తగా వ్యవహరించబోతున్నారు.(Photo:Instagram)
2/ 9
ఇండియన్ గ్రేట్ డైరెక్టర్‌గా మారిన ఎస్ఎస్ రాజమౌళి కర్నాటక రాష్ట్రంలో జన్మించారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకాలోని అమరేశ్వర క్యాంపు ఆయన జన్మస్తలం కావడంతో రాయచూర్ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచే బాధ్యతను దర్శకధీరుడికి అప్పగించనున్నారు అధికారులు. (Photo:Instagram)
3/ 9
గత కొంతకాలంగా రాయచూర్ జిల్లాలో ఎన్నికల ఓటింగ్ శాతం తగ్గడంతో జిల్లా అధికారులు ఓటర్లలో ఓటుపై అవగాహన కల్పించే బాధ్యతను అంటే ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళిని నియమిస్తే బాగుటుందని భావించారు. ఇందులో భాగంగానే ఆయన్ని సంప్రదిస్తే ఓకే చెప్పారట. (Photo:Instagram)
4/ 9
రాయచూర్ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచడమే ప్రధాన లక్ష్యంగా రాజమౌళిని సంప్రదించి ..ప్రచారకర్తగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించడంలో దర్శకధీరుడే సరైన వ్యక్తిగా భావించామన్నారు.(Photo:Instagram)
5/ 9
తాము భావించినట్లుగా రాజమౌళితో ఓటుపై అవగాహన పెంచి ప్రజల్ని చైతన్యం కలిగిస్తే పోలింగ్ శాతం పెరుగుతుందనే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సిఫార్సు చేయడం జరిగింది. అందుకు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు.(Photo:Instagram)
6/ 9
రాజమౌళి ప్రత్యక్షంగా లేదంటే వీడియోల ద్వారా లేదంటే సోషల్ మీడియా మాద్యమం ద్వారా రాయచూర్ జిల్లా ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తే దాని ప్రభావం, ఫలితం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. (Photo:Instagram)
7/ 9
ప్రపంచ రికార్డులు తిరగరాసిన సినిమాగా ట్రిపులార్‌ను జక్కన్న మలిచారు. అందుకే ఈసినిమా ప్రస్తుతం ఆస్కార్ అవార్డు రేసులో ఉంది. దానికి సంబంధించిన పనులు, పర్యటనలతో రాజమౌళి బిజీగా ఉన్నారు.(Photo:Instagram)
8/ 9
ఇప్పటికే ట్రిపులార్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన విషయం అందరికి తెలుసు. సినిమాకు, లేదంటే తారక్ పాత్రకు కూడా అవార్డు దక్కే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. (Photo:Instagram)
9/ 9
హీరోలు, సెలబ్రిటీల రేంజ్‌ను దాటిపోయింది డైరెక్టర్ రాజమౌళి క్రేజ్. తెలుగులో తీసిన బాహుబలి, ట్రిపులార్ సినిమాలతో ఆయన వరల్డ్ ఫేమస్ డైరెక్టర్‌గా మారారు. అందుకే ఆయన పుట్టిన రాష్ట్రంలోని అధికారుల చూపు కూడా ఈ దర్శకధీరుడిపై పడింది. (Photo:Instagram)