Beggar Last Rites: యాచకుడి అంత్యక్రియలకు వేలాది జనం హాజరు.. రోడ్లపై ఫ్లెక్సీలు, బ్యానర్లు
Beggar Last Rites: యాచకుడి అంత్యక్రియలకు వేలాది జనం హాజరు.. రోడ్లపై ఫ్లెక్సీలు, బ్యానర్లు
Beggar Last Rites: రోడ్డుపై భిక్షమెత్తుకునే యాచకుడు మరణిస్తే.. ఎవరికీ పట్టడు. కనీసం అటు వైపు కూడా ఎవ్వరూ చూడరు. చివరకు మున్సిపాలిటీ సిబ్బందే వారికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ కర్నాటకలో ఓ బిచ్చగాడి అంత్యక్రియలకు జనం భారీగా తరలివచ్చారు.
కర్ణాటకలోని విజయనగర జిల్లా హూవినహడగలి గత శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మానిసక దివ్యాంగుడైన హుచ్చ బస్య(45) తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఒక యాచకుడు. రోడ్డపై భిక్షమెత్తుకుంటూ జీవనం సాగించేవాడు.
2/ 7
ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో స్థానికులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. కానీ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నూమూశాడు. ఆ వార్త తెలియగానే హూవినహడగలిలోని స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
3/ 7
హుచ్చ బస్య పట్టణంలో దాదాపు అందరికీ సుపరిచితమే. అందుకే ఆయన మరణించాడన్న వార్త తెలియగానే.. అందరూ శోకసంద్రంలో ముగినిపోయారు. తలా కొంత డబ్బులు వేసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
4/ 7
అంత్యక్రియలకు వందలాది మంది హాజరై హుచ్చబస్వకు తుది వీడ్కోలు పలికారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ పట్టణంలోని పలు కూడళ్లలో బ్యానర్లు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.
5/ 7
హుచ్చ బస్వ తల్లి ఇటీవలే మరణించడంతో ఆయన ఒంటరి వాడయ్యాడు. అప్పటి నుంచీ పట్టణంలోని ఆలయాలు, పాఠశాలల్లో తలదాచుకునేవాడు. అందరినీ ప్రేమతో అప్పాజీ అనే పిలిచేవాడు.
6/ 7
[caption id="attachment_1091072" align="aligncenter" width="1200"] తనకు ఎదురు వచ్చిన వారిని ఒకే ఒక్క రూపాయి అడిగేవాడు. అంతకన్నా ఎక్కువ తీసుకోడు. ఇచ్చినా సరే తీసుకునే వాడు కాదు. బస్యకు రూపాయి ఇస్తే తమకు మంచి జరుగుతుందని చాలా మంది నమ్మేవారు.
[/caption]
7/ 7
మానసిక దివ్యాంగుడయినప్పటికీ అందరితోనూ చాలా మంచిగా ఉండేవాడు హుచ్చ బస్య. సాధారణ ప్రజలే కాదు.. ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు కనిపించినా రూపాయి అడిగేవారు. ఇలా ఆయనతో ఎంతో మందికి అనుబంధం ఏర్పడింది. అందుకే బస్య మరణవార్తను చాలా మంది జీర్ణించుకోలేపోతున్నారు.