Ooty Snow : వణుకుతున్న ఊటీ.. ఆలస్యంగా పలకరించిన మంచు
Ooty Snow : వణుకుతున్న ఊటీ.. ఆలస్యంగా పలకరించిన మంచు
Ooty Snow : సాధారణంగా చల్లగా ఉండే ఊటీ ఇప్పుడు మరింత చల్లగా మారిపోయింది. ఈ సీజన్లో రావాల్సిన మంచు మొత్తానికి రావడంతో.. టూరిస్టులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
తమిళనాడులోని ఉదగమండలం.. అదేనండీ.. ఊటీలో విపరీతమైన మంచు కురుస్తోంది. చలిగాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు, టూరిస్టులూ ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణుకుతున్నారు.
2/ 5
నీలగిరి జిల్లాలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు నుంచి జనవరి చివరి వరకు నీటి బిందువులతో మంచు, పొగ మంచు కురుస్తుంది. ఈ సంవత్సరం, రుతుపవనాల తర్వాత తుఫాను, వర్షాలు రావడం వల్ల వాతావరణంలో మార్పుు వచ్చి.. మంచు సీజన్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.
3/ 5
ఈ పరిస్థితిలో ఊటీ నగరంలో నిన్న చాలా చోట్ల మంచు కురిసింది. జలాశయాల సమీపంలోని గడ్డి పొలాలు, బొటానికల్ గార్డెన్, మార్కెట్ ఏరియా, గుర్రపు పందెం, బోట్ హౌస్ తదితర ప్రదేశాల్లో నీరు, మంచు కనిపించాయి.
4/ 5
రోడ్లపై పార్క్ చేసిన వాహనాలపై పెద్ద ఎత్తున వాటర్ ఐస్ కనిపించింది. వాటర్ ఐస్ కారణంగా చలి విపరీతంగా ఉండడంతో చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.
5/ 5
రాత్రి, తెల్లవారుజామున మంచు కురుస్తుంటే.. పగటివేళ ఎండలు ప్రభావం కనిపిస్తోంది. వచ్చే ఎండాకాలంలో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందనే అంచనా ఉంది.