ఇక మన దేశంలో భూకంప భ్రంశ మండలాలను నాలుగు జోన్లుగా నిర్ణయించారు. జోన్ 5: ఈ జోన్లో అత్యధిక అపాయం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఇవి రిక్టర్ స్కేల్‌పై 7 నుంచి 9 పాయింట్ల తీవ్రతను నమోదుచేస్తాయి. అన్ని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, ఉత్తర బిహార్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లో కొంత ప్రాంతం, గుజరాత్‌లోని కచ్-భుజ్ ఈ జోన్లో ఉన్నాయి.
జోన్ 4: ఈ ప్రాంతంలో భూకంపాలు అధిక అపాయాన్ని కలిగిస్తాయి. రిక్టర్‌స్కేల్‌పై 6 నుంచి 7 పాయింట్ల తీవ్రత నమోదుకు అవకాశం ఉంది. దిల్లీ, సిక్కిం, దక్షిణ బిహార్, దక్షిణ ఉత్తరాఖండ్, గుజరాత్, జమ్మూకశ్మీర్, పశ్చిమ బెంగాల్ దక్షిణ భాగం; మహారాష్ట్రలోని కొయనా ప్రాంతాలు ఈ జోన్లో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
జోన్ 3: ఇక్కడ మాధ్యమిక భూకంపాల అపాయం ఉంటుంది. రిక్టర్‌స్కేల్‌పై 4 నుంచి 6 పాయింట్ల తీవ్రత నమోదవుతుంది. ఇందులో పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్ పశ్చిమ భాగం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, , , గోవా, లక్షదీవులు, రాష్ట్రాలు ఉన్నాయి. కోల్‌కతా, చెన్నై, ముంబయి మహానగరాలు కూడా ఈ జోన్లోకి వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)