భారత్‌లో రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులతో ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ వృద్ధి రేటు వేగంగా పెరుగుతోంది. దీనికి ఒమిక్రాన్ వేరియంటే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలుగా ఆంక్షలు విధించాయి.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇన్ఫెక్షన్ రేటు వేగంగా పెరుగుతున్నట్టు గుర్తించారు. డిసెంబర్ 24 నాటికి ఆరు రాష్ట్రాల్లో వైరస్ ఆందోళనకరంగా ఉండగా.. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు ట్రాకర్ ద్వారా కనుగొన్నారు. అయితే డిసెంబర్ 26 నాటికి 11 రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల వృద్ధి రేటు పెరిగినట్లు గుర్తించారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను విస్తృతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. ఇదే సమయంలో హెల్త్ కేర్ వర్కర్లు, దీర్ఘకాలిక అనారోగ్యాల బాధితులకు ప్రికాషన్ డోస్ పేరుతో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి సైతం 2022 జనవరి నుంచి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)