ఐఆర్సీటీసీ టూరిజం కేరళ , క్రూజ్ టూర్, ఐఆర్సీటీసీ కేరళ క్రూజ్ టూర్, ఆర్వీ వైకుండం క్రూజ్ ప్యాకేజీ, అలెప్పీ క్రూజ్ టూర్ ప్యాకేజీ" width="1200" height="800" /> గాడ్స్ ఓన్ ల్యాండ్ : కేరళ.. గాడ్స్ ఓన్ ల్యాండ్‌గా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. ప్రకృతి అందాలు, కొబ్బరి తోటలు, పశ్చిమ కనుమలు, ఎత్తైన పర్వతాలు, అందమైన జలపాతాలు, బ్యాక్ వాటర్‌కు ప్రసిద్ధి చెందింది. మలబార్ తీరానికి ఆనుకుని ఉన్న ఈ రాష్ట్రం పర్యాటక ప్రదేశాలకు పెట్టింది పేరు. అందుకే ప్రపంచవ్యాప్తంగా చూడదగ్గ 52 పర్యాటక ప్రదేశాల్లో కేరళ ఒకటిగా నిలిచింది. భారత్‌లో ఎన్నో వారసత్వ ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ.. వాటన్నిటినీ దాటుకుని కేరళ ఎంపిక కావడం విశేషం.(ప్రతీకాత్మక చిత్రం)
కుమరకోమ్ గురించి వివరణ : కేరళలోని వివిధ ప్రాంతాల విశిష్ఠతను న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వివరించింది. ముఖ్యంగా కేరళలోని కుమరకోమ్ ప్రాంతం గురించి అందులో పేర్కొంది. ఇక్కడి బ్యాక్ వాటర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ ప్రాంతంలోని కాలువలు, తాటి చెట్లపైకి ఎక్కే పద్ధతిని వివరించింది. అలాగే, కొబ్బరి తాళ్లను అల్లడాన్ని న్యూయార్క్ టైమ్స్ తన స్టోరీలో మెన్షన్ చేసింది. మరవంతారుతు సంప్రదాయ నృత్యాల గురించి కూడా ఆర్టికల్‌లో హైలైట్ చేసింది.
సైబీరియన్ కొంగల సందర్శన, అరవిజిక్కు జలపాతాల అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవు. అలాగే, ఇక్కడి వంటకాలు కూడా పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కొబ్బరి నూనెతో చేసే వంటకాలు విభిన్న రుచిని తీసుకొస్తాయి. ఆయుర్వేద చికిత్సలకు కూడా కేరళ ఫేమస్ అయ్యింది. మసాజ్ థెరపీ, ఆయుర్వేద వైద్య విధానం పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
‘రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్’(Responsible Tourism Mission) సంస్థ రాష్ట్రంలో బాధ్యతాయుత పర్యాటకంపై వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. అంతేగాకుండా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘గ్రామీణ పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు’(Rural Tourism Development Project) అమలుకు కూడా కృషి చేస్తోంది. అందుకే 2022లో టూరిజంలో కేరళ 3 అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. గ్లోబల్ విజన్ అవార్డ్ 2022, గ్లోబల్ అవార్డ్, ఇండియన్ సబ్ కాంటినెంట్ అవార్డులు కేరళను వరించాయి.(ప్రతీకాత్మక చిత్రం)