అప్పుడే పుట్టిన పిల్లలకు ఆస్పత్రిలోనే ఫొటో తీసుకొని ఒక్క క్లిక్‌తోనే ఆధార్ కార్డు జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సౌరభ్ గార్గ్ చెప్పారు. ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్ అవసరం లేదని.. కేవలం వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తామని తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఐదేళ్లు పూర్తైన తర్వాత చిన్నారుల బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 99.7 శాతం మందికి (131 కోట్ల మంది) ఆధార్ కార్డు జారీ చేశామని చెప్పారు. ఏటా 2-2.5 కోట్ల జననాలు జరుగుతున్నాయని, పుట్టిన వెంటనే వారికి ఆధార్ నంబర్ కేటాయించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.. (ప్రతీకాత్మక చిత్రం)