ప్రతీ సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో ఏటా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. వేలాది మంది క్షతగాత్రులవుతున్నారు. ఇలా ప్రమాదాల్లో మరణించిన వారు ఎక్కువగా ద్విచక్రవాహదారులే ఉంటున్నారని పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కూడా 85 శాతం మంది తలకు బలమైన గాయం కారణంగానే చనిపోతున్నారని అధ్యయనాల్లో తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రైడర్‌తో పాటు వెనుక కూర్చున్న పిలియన్ రైటర్లు సైతం దుర్మరణం చెందుతున్న ట్లు గుర్తించిన పోలీసులు పిలియన్ రైడర్‌కు కూడా హెల్మెట్ వాడకం తప్పనిసరి చేశారు. లేదంటే జరిమానాలు విధిస్తున్నారు. దాంతో వ్యాపారులకు విపరీతమైన గిరాకీ పెరిగింది. జాతీయ రహదారుల వెంట, గల్లీ రోడ్ల వెంట నకిలీ హెల్మెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ముందు ప్రజల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన రావాలనుకున్న పోలీసులూ వాటి నాణ్యతపై పెద్దగా దృష్టి సారించలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పటికే సైబరాబాద్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా 20 మందికి పైగా వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. హెల్మెట్స్ను తలకు ధరించకుండా వాహనానికి తగిలించడం మంచి పద్ధతి కాదన్నారు. నకిలీ హెల్మెట్ వాడకం వల్ల సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది కేవలం 5 నెలల్లో 145 మంది మృతి చెందినట్లు పోలీసులు అధ్యయనంలో తేలిందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)