TELUGU WOMAN SRIKALA REDDY ELECTED CHAIRPERSON OF JAUNPUR ZILLA PARISHAD IN UP SU
Srikala Reddy: ఉత్తరప్రదేశ్‌లో తెలుగు మహిళ గెలుపు.. జెడ్పీ చైర్‌పర్స్‌గా ఎన్నిక.. ఆమె ఎవరంటే..
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ మహిళ సత్తా చాటింది. అక్కడ జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఆమె.. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
వివరాలు.. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి ఉత్తర్‌ప్రదేశ్‌లోని జన్పూర్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. శ్రీకళారెడ్డి.. కీసర మాజీ ఎమ్మెల్యే జితేందర్‌రెడ్డి కుమార్తె.
2/ 4
అక్కడ జరిగిన పరిషత్ ఎన్నికల్లో పోటీచేసిన ఆమె జడ్పీటీసీ సభ్యులరాలిగా గెలుపొందారు. ఆ తర్వాత జన్పూర్ జిల్లా పరిషత్‌లో.. 83 మంది సభ్యులుండగా.. ఆమెకు 43 మంది మద్దతు తెలిపారు.
3/ 4
గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న శ్రీకళారెడ్డికి యూపీకి చెందిన ధనుంజయ్‌తో వివాహమైంది. ఈ దంపతులు ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.
4/ 4
శ్రీకళారెడ్డి భర్త ధనుంజయ్.. గతంలో ఎంపీగా పనిచేశారు. ఆయనకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ప్రస్తుతం ఆయన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు.