Tejas Express: రైలు 2 గంటలు ఆలస్యం.. ప్రయాణికులకు రూ.4.49 లక్షల పరిహారం..

Tejas Express Train: నువ్వు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు.. మన దేశంలో రైళ్ల ఆలస్యంపై ఇలా ఎన్నో విమర్శలున్నాయి. ఒక్క రైలు కూడా టైమ్‌కి రాదు.. టైమ్‌కు గమ్యానికి చేరుకోదని ప్రయాణికులు చిరాకు పడిన సందర్భాలూ చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. ఎంతలా అంటే.. రైలు ఆలస్యంగా వెళ్తే.. ప్రయాణికులకు పరిహారం చెల్లించేంతలా.. భారతీయ రైల్వేలో మార్పు వచ్చింది.