తల్లి పిల్లలని నవమాసాలు మొస్తే.. తండ్రి జీవితాంతం తన బిడ్డలను గుండెల్లో మోస్తాడు. నాన్న ప్రేమ కొలవడానికి వీలులేనంత. ఇక తండ్రి కూతురు మధ్య బంధం, అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కూతురుకి నాన్నపై ఉన్న ప్రేమ ఆకాశమంత.. తండ్రికి కూతురు అంటే అపురూపం.. కూతురు అంటే తనకు మరో అమ్మే అని .. ఇంటికి లక్ష్మీదేవి అని ఎంతో గారంగా పెంచుకుంటాడు. (ప్రతీకాత్మక చిత్రం)
కేరళకు చెందిన 17 ఏళ్ల దేవానంద అనే యువతి.. తన కాలేయంలో కొంత భాగాన్ని దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్న 48 ఏళ్ల తన తండ్రికి దానం చేసి దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన అవయవ దాతగా నిలిచింది. కుటుంబానికి సరైన దాత దొరకకపోవడంతో దేవానంద తన కాలేయంలో కొంత భాగాన్ని తన తండ్రికి దానం చేసింది. ఫిబ్రవరి 9న అలువాలోని రాజగిరి హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగింది. (Image credit : NDTV)
దేశంలోని చట్టం ప్రకారం మైనర్లకు అవయవాలు దానం చేయడానికి అనుమతి లేదు. మానవ అవయవ మార్పిడి చట్టం 1994 ప్రకారం నిబంధనలు మైనర్ల నుండి అవయవాలను దానం చేయడానికి అనుమతించవు. దీంతో 12వ తరగతి చదువుతున్న దేవానంద.. హైకోర్టును ఆశ్రయించింది. తన తండ్రికి తాను లివర్ దానం చేసేందుకు అనుమతి ఇవ్వాలని దేవానంద చేసిన అభ్యర్థనకు కోర్టు ఆమోదం తెలిపింది.(Image credit : Manorama)
దేవానంద యొక్క వీరోచిత ప్రయత్నాలను ప్రశంసిస్తూ ప్రతీష్ ఆపరేషన్ ఖర్చులను హాస్పిటల్ మాఫీ చేసింది. ఒక వారం ఆసుపత్రిలో ఉన్న తర్వాత దేవానంద ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయబడింది. తాను గర్వంగా, సంతోషంగా ఉన్నట్లు దేవానంద చెప్పింది. 48 ఏళ్ల ప్రతీష్ త్రిసూర్‌లో ఓ కేఫ్ నడుపుతున్నాడు.(Image credit : the news minute)