Photos: హైదరాబాద్‌లో తమిళ సమ్మేళనం

రాష్ట్రాలు దాటిన, దేశాలు దాటిన ఖండాంతరాలు దాటిన, తమిళులు అంతా ఒక్కటే అన్నారు తమిళ టాప్ డైరెక్టర్ విజయకుమార్. హైదరాబాద్ మానగర్, NESCA CANADA HOMES గ్రూపు ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని ఫినిక్స్ ఎరీనా పార్కులో తమిళ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ పాల్గొన్నారు. హైదరాబాద్ మానగర్ తమిళ్ సంగం ఏర్పాటు చేసి 21 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశంలో అనేక రంగాల్లో తమిళులు ప్రతిభ సాగిస్తున్న విధానాన్ని డైరెక్టర్ విజయకుమార్ కొనియాడారు. ఎక్కడ ఉన్నా తమిళులు తమ రాష్ట్రం కోసం దేశం కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.