ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అసోం, జమ్మూకాశ్మీర్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. (Image:ANI)
2/ 8
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కార్యాలయాలతో పాటు నేతలు, కార్యకర్తల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే అన్ని చోట్లా ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు.(Image:ANI)
3/ 8
పీఎఫ్ఐ కార్యాలయాలతో పాటు నేతల ఇళ్లల్లో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా 100 మందికి పైగా NIA అధికారులు అరెస్ట్ చేశారు.(Image:ANI)
4/ 8
ప్రజల నుంచి డబ్బులు సమీకరించి ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తోందని, యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించడంతో పాటు కరాటే పేరుతో శిక్షణ ఇస్తున్నట్లు పీఎఫ్ఐపై ఆరోపణలున్నాయి.(Image:ANI)
5/ 8
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసుల బందోబస్తు మధ్య పీఎల్ఐ కార్యాలయాలపై ఎన్ఐఏ దాడులను కొనసాగిస్తోంది.(Image:ANI)
6/ 8
PFI కార్యాలయాలు, కార్యకర్తల ఇళ్లపై దాడులను నిరసిస్తూ కేరళ, తమిళనాడులో పలువురు ఆందోళనలు చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి ఎన్ఐఏకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.(Image:ANI)
7/ 8
గత నెలలో ఏపీ, తెలంగాణలో దాడులు చేసిన ఎన్ఐఏ..నిజామాబాద్‌లో కరాటే టీచర్ అబ్దుల్ ఖాదర్‌ను అరెస్ట్ చేశారు. కరాటే పేరుతో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి.(Image:ANI)
8/ 8
అబ్దుల్ ఖాదర్ ఇచ్చిన సమాచారంతోనే దేశవ్యాప్తంగా ఇవాళ ఎన్ఐఏ దాడులు చేసింది. దేశంలో అలజడి చేసేందుకు కుట్రచేసినట్లుగా సమాచార రావడంతోనే సోదాలు చేస్తున్నట్లు సమాచారం.(Image:ANI)