Photos: జమ్మూకాశ్మీర్లో ఎట్టి పరిస్థితుల్లో శాంతియుత వాతావరణం ఉండకూడదని ఉగ్రవాదులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఇలాంటి దుర్మార్గపు దాడులకు పాల్పడుతున్నారు.
సమయం రాత్రి 11 గంటలు. ఏరియా జమ్మూకాశ్మీర్లోని బనిహాల్ పట్టణం. అక్కడి MG కంపెనీ ఆఫీస్ దగ్గర... నిర్మాణ కార్మికులు నిద్రపోతుంటే... ఒక్కసారిగా గ్రనేడ్ దాడి జరిగింది.
2/ 12
ఉగ్రవాదులు... గ్రనేడ్ విసిరి పారిపోయారు. అది భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ దాడిలో కార్మికులు ఉంటున్న వసతి గృహం తుక్కుతుక్కైంది.
3/ 12
ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఒకరు కార్మికుడు కాగా... మరొకరు పక్కనే ఉన్న దారులూమ్ నొమానియా బనిహాల్ మదర్సాలో విద్యార్థి.
4/ 12
గాయపడిన వారిని దగ్గర్లోని బనిహాల్ ఆస్పత్రికి తరలించారు.
5/ 12
ఈ దాడి ఎంత పెద్దగా జరిగిందంటే... అక్కడి ఓ బండరాయి సైతం ముక్కలైపోయింది.
6/ 12
ఇది ఎవరి పని అన్నది పోలీసులు గమనిస్తున్నారు. అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకుంటున్నారు.
7/ 12
MG కంపెనీ... బనిహాల్ బైపాస్ నిర్మిస్తోంది. ఇది హైవేస్ 4 లేన్ ప్రాజెక్టులో భాగం.
8/ 12
ఇది నిర్మిస్తే... మరింత అభివృద్ధి జరిగిపోయినట్లు అయిపోతుందనీ... తద్వారా ప్రజలు సుఖంగా ఉంటారని భావించిన ఉగ్రవాదులు... కుట్రపూరితంగా ఈ దాడి చేసినట్లు భావిస్తున్నారు.
9/ 12
ఇది ఎవరిపనో తేల్చేందుకు వేట మొదలైందని SHO నయీమ్ ఉల్ హక్ తెలిపారు.
10/ 12
గాయపడినవారిలో ఒకరు 35 ఏళ్ల గోపాల్ శర్మ అని తెలిసింది. ఆయన ఉధమ్పూర్ వాసి. MG కంపెనీలో కార్మికుడు.
11/ 12
మరో గాయపడిన వ్యక్తి 16 ఏళ్ల అక్విబ్. మదర్సా విద్యార్థి.
12/ 12
ఇలా ఉగ్రవాదులు తాము ఇంకా పూర్తిగా జమ్మూకాశ్మీర్ నుంచి పోలేదని... తమ ఉనికిని చాటుకునేందుకు ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.