ఈ అర్థరాత్రి నుంచి దేశంలో రూ.500, రూ.1000 నోట్లు చెల్లవు అని నవంబర్ 8, 2016న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన ప్రకటన చేయకముందు చాలా మంది.. "ఈ పెద్ద నోట్లు రద్దైపోతే బాగుండు.. అప్పుడు అక్రమార్కులు దాచిన నల్లధనం అంతా పనికిరాకుండా పోతుంది.. దేశంలో బ్లాక్ మనీ సమస్య పోతుంది" అని అన్నారు. తీరా ప్రధాని అదే పని చేశాక.. ఈ అంశంపై పెద్ద చర్చే జరిగింది. కొంతమంది మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకించారు. (File Photos)
పెద్ద సమస్య ఏంటంటే.. ఈ నిర్ణయం వల్ల అప్పట్లో చాలా మంది పేదలు ఇబ్బంది పడ్డారు. బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడలేక ప్రాణాలు కోల్పోయినవారూ ఉన్నారు. ధనవంతులెవరూ క్యూలో లేరనీ.. పేదలే ఉన్నారని అప్పట్లో సహా ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దానికి తోడు.. దేశంలో నల్లధనానికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం అని మోదీ ప్రకటించగా.. నోట్ల రద్దు తర్వాత నల్లధనం ఏమాత్రం తగ్గలేదు. బ్లాక్ మనీ బయటకు రాలేదు. (File Photo)
సడెన్‌గా ప్రకటించిన నిర్ణయం వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయని సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు వచ్చాయి. ఇలాంటి నిర్ణయాన్ని సడెన్‌గా ప్రకటించకపోతే.. అక్రమార్కులు అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసేసుకుంటారు కాబట్టే.. సడెన్‌గా ప్రకటించారన్నది కేంద్రం వాదన. ఈ అంశంపై చాలాసార్లు విచారణలు జరిగాయి. కేంద్రం, (RBI).. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నదీ సుప్రీంకోర్టుకు తెలిపాయి. రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాదనలు చేసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కూడా ఉన్నారు.
ఈ అంశంపై జస్టిస్ ఎస్ ఎన్ జీర్ సారధ్యంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ ఇవాళ తీర్పు ఇస్తుంది. జస్టిస్ నజీర్తోపాటూ ఈ ధర్మాసనంలో గవాయ్, నాగరత్న, ఎఎస్ బొపన్న, వి.రామసుబ్రమణియన్‌లు సభ్యులుగా ఉన్నారు. శీతాకాల సెలవుల తర్వాత సుప్రీంకోర్టు ఇవాళ ప్రారంభమవుతుంది. జస్టిస్ నజీర్ జనవరి 4న రిటైర్ అవుతున్నారు. అందుకే ఇవాళ తీర్పు ఇస్తున్నారని తెలిసింది. బెంచ్‌లోని ఐదుగురు సభ్యుల్లో నోట్ల రద్దును ఎంత మంది సమర్థిస్తున్నారు? ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు? అనేది కీలకం. అందరూ ఒకే రకమైన స్పందన వ్యక్తం చేసే అవకాశాలు తక్కువ. ఐదుగురు సభ్యులు ఉన్నారు కాబట్టి.. ఈ తీర్పే ఫైనల్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)