Ayodhya Verdict: నేడే అయోధ్య తుది తీర్పు... దేశమంతా ఉత్కంఠ
Ayodhya Verdict: నేడే అయోధ్య తుది తీర్పు... దేశమంతా ఉత్కంఠ
కొన్ని దశాబ్దాలుగా పరిష్కారం కాని అయోధ్య కేసులో సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. అయోధ్య రామజన్మభూమిపై ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తుది తీర్పును వెలువరించనున్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫైజాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. తీర్పు తర్వాత ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువ మంది పోలీసులను మోహరిస్తున్నారు.