Summer Health Tips: చెమట వాసనకు చెక్... సింపుల్ ఇంటి చిట్కాలు ఇవీ
Summer Health Tips: చెమట వాసనకు చెక్... సింపుల్ ఇంటి చిట్కాలు ఇవీ
శరీర దుర్వాసన, చెమట ఇతర చర్మ కణాల నుంచీ దుర్వాసన వస్తుంది. సూక్ష్మక్రిములు జీవించే ఆ వాసనను భరించడం కష్టం. ఆ సమస్యలు మనకు ఎంతో అసౌకర్యం కలిగిస్తాయి. మరి వాటికి చెక్ పెట్టాలంటే ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరి.
1/ 7
బేకింగ్ సోడా ద్వారా శరీర దుర్వాసనను పోగొట్టవచ్చు. బేకింగ్ సోడాను చెమట పట్టే ప్రాంతాల్లో రాస్తే... శరీరాన్ని ఇది పొడిగా ఉంచుతుంది.
2/ 7
వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి చంకల కింది భాగాన్ని యాంటి బాక్టీరియల్ సోప్, వేడినీళ్లతో రోజుకు రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి.
3/ 7
స్కిన్ పిహెచ్ వాల్యూ తక్కువగా ఉంటే దుర్వాసనకు కారణమైన బాక్టీరియా చర్మంపై ఉండదు.
4/ 7
నిమ్మకాయ కూడా బాక్టీరియాను చంపేస్తుంది. నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు చెక్కలుగా కోసి... ఒక చెక్కతో చంకల కింది భాగంలో రుద్దాలి. దుర్వాసన పోయే వరకూ రోజుకు ఒకసారి ఇలా చేస్తుండాలి.
5/ 7
తినే ఆహారం వల్ల కూడా శరీరం దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తీసుకునే ఆహారంలో కెఫైన్, మసాలా, ఆల్కహాల్, వంటివి లేకుండా చూసుకోవాలి.
6/ 7
చెమటను తేలిగ్గా తీసుకోవద్దు. అందులో క్రిములు ఉంటాయి. వాటి వాసన ఎవరికైనా అసౌకర్యం కలిగిస్తుంది.
7/ 7
చిన్నచిన్న ఇంటి చిట్కాలు పాటిస్తే... చెమట వాసన సమస్య నుంచి విముక్తి పొందవచ్చు