Lata Mangeshkar: దివికెగసిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మృతికి చింతిస్తూ ఆమె సైకతశిల్పాన్ని రూపొందించాడు శిల్పి సుదర్శన్ పట్నాయక్. ఒడిశాలోని పూరి బీచ్‌లో గానకోకిల సైకతశిల్పాన్ని చిత్రీకరించి... మేరీ ఆవాజ్ హీ పెహచాన్ హై అనే క్యాప్షన్‌ని సీడీపై రాశాడు. ఇండియన్ నైటేంగిల్ లతామంగేష్కర్‌కి నివాళులు అర్పించాడు.
1/ 6
ఏడు దశాబ్ధాలుగా తన మధురమైన స్వరంతో యావత్ భారతావనిని తన అభిమానులుగా మార్చుకున్న గానకోకిల లతా మంగేష్కర్ శకం ముగిసింది. దిగ్గజ గాయని ఈలోకం నుంచి వెళ్లిపోవడాన్ని చింతిస్తూ ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఆమెకు ఘన నివాళలర్పించారు.
2/ 6
ఒడిశాలోని పూరీ బీచ్‌లో లతామంగేష్కర్ సైతక శిల్పాన్ని చిత్రీకరించి లెడంజరీ సింగర్‌కి ఇదే నా నివాళి అంటూ తన సంతాన్ని ప్రకటించారు.
3/ 6
లతా మంగేష్కర్ అస్వస్థతకు గురైన సందర్భంలో కూడా సుదర్శన్ పట్నాయక్ త్వరగా కోలుకోవాలని కోరుతూ సైకతశిల్పాన్ని చిత్రీకరించాడు. గెట్వెల్ సూన్ లతా దీదీ అంటూ తన గుండెల్లోని అభిమానాన్ని బొమ్మగా వేసి చాటుకున్నాడు.
4/ 6
మహాగాయని లేదన్న వార్త అశేష ప్రజానికాన్ని కదిలించింది. ఆమెకు చివరి చూపి..కన్నీటి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ, సంగీత, క్రీడా ప్రముఖులు ఎందరో వచ్చి నివాళులర్పించారు.
5/ 6
దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం దివికెగసిన గానకోకిల అంత్యక్రియలకు హాజరయ్యారు. లతామంగేష్కర్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
6/ 6
గానకోకిల లతామంగేష్కర్ సంగీత ప్రపంచంతో పాటు అశేష అభిమానుల్ని వదిలి వెళ్లిందన్న వార్తను ఇంకా సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు.