కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అనేక రాష్ట్రాలు మళ్లీ విద్యాసంస్థలను తెరవడంపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం 10, 12 తరగతుల విద్యార్థుల కోసం స్కూల్స్ తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
అయితే ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యాసంస్థలకు వచ్చే స్టూడెంట్స్ కచ్చితంగా తన తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక అంగీకార పత్రం తీసుకురావాలని సూచించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
అంతేకాదు స్కూల్స్లో విద్యార్థులు ఇతర స్టూడెంట్స్తో బుక్స్, స్టేషనరీ సామాగ్రిని పంచుకోవడాన్ని నిషేధించింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
స్కూల్స్లో కచ్చితంగా మెడికల్ క్యాంపులు ఉండాలని స్పష్టం చేసింది. స్కూల్కు వచ్చే విద్యార్థులకు ప్రతిరోజు కచ్చితంగా థర్మల్ స్కానింగ్ చేయాలని సూచించింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
జలుబు, జ్వరం, ఫ్లూ లక్షణాలు ఉన్నవారిని స్కూల్స్లోకి అనుమతించవద్దని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇక ఆన్లైన్ ద్వారానే చదువుకోవాలనుకునే వారికి ఆ పద్ధతిని కొనసాగించాలని ఢిల్లీ విద్యాశాఖ స్పష్టం చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)