డీజిల్ ధరలు, లేటెస్ట్ పెట్రోల్ డీజిల్ ధరలు, దేశంలో ఆయిల్ ధరలు" width="1600" height="1600" /> 20 రోజులు గడుస్తున్నా పై యుద్దం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. లొంగుబాటుకు నిరాకరిస్తుండటంతో ఉక్రెయిన్ను నేలమట్టం చేసేలా రష్యా దాడులను ఉధృతం చేసింది. ఆ రెండు దేశాల నుంచి ఎగుమతి దిగుమతులు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం, బొగ్గు, సిమెంట్ తదితరాల ధరలు భారీగా పెరిగాయి. భారత్ పైనా ఆ ప్రభావం తీవ్రంగా ఉంది.
నిజానికి ఆయిల్ ధరల పెంపు నిర్ణయాన్ని కంపెనీలకు కట్టబెట్టిన తర్వాత రోజుకింత చొప్పున భారీ వడ్డన ఉండేది. కానీ గత నవంబర్ నుంచి మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెంపు ఉంటుందని భావించినా, మోదీ సర్కార్ మరోలా ఆలోచిస్తోంది. దేశంలో ఆయిల్ ధరలను స్థిరీకరించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఇంధనం కొనుగోళ్లు, ధరల నియంత్రణకు సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పురి సోమవారం రాజ్యసభలో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మార్కెట్ నుంచి ఇంధనం కొనుగోలు చేసేందుకు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని, కరెన్సీ, ఇన్సూరెన్స్, రవాణా ఛార్జీలను బేరీజు వేస్తున్నామని మంత్రి తెలిపారు.
పెట్రోల్ ధరలు 63 సార్లు, డీజిల్ ధరలు 61 సార్లు పెరిగినట్లు ఎం పీ కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. అయితే గత నవంబర్ నుంచి పెట్రోల్ ధరలు పెరగలేదని, ధరలు పెంచకపోవడం సంతోషకరమని, అయితే ధరలను ఇలాగే స్థిరీకరిస్తారా అని అడగ్గా, స్థిరీకరణ దిశగా యత్నాలు చేస్తున్నామని మంత్రి బదులిచ్చారు.