గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని... ఇండియాలో మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్రం తెలిపింది. చైనా వల్లే ఇతర దేశాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇతర దేశాల్లో పరిస్థితి నిశితంగా గమనిస్తున్నామని, దానికి తగ్గట్టుగా మన దేశంలోనూ కరోనా కట్టడి చర్యలను చేపడుతున్నామని చెప్పారు.
కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. కొత్త వేరియంట్ బీఎఫ్-7పై అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. కొత్త వేరియంట్‌ను గుర్తించేందు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని సూచించారు. ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చే వారిలో RT-PCR టెస్ట్‌లు చేస్తున్నామని... కరోనా కట్టడి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.
ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలు ఉన్నందున మాస్క్‌ని మళ్లీ తప్పనిసరి చేయాలని స్పష్టం చేసింది. శానిటైజర్లతను వాడకంతో పాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టడంతో పాటు ప్రికాషన్ డోస్‌ల పట్ల అవగాహన కల్పించాలని తెలిపింది.