కరోనా లాక్డౌన్ కారణంగా... వాహనాల రవాణా, ఫ్యాక్టరీలు రెండు నెలలు ఆపివేయడంతో... దేశంలో కార్బన్ డై ఆక్సైడ్ తగ్గి... వాతావరణంలో వేడి కూడా తగ్గింది. ఫలితంగా... ఈసారి నైరుతీ రుతుపవనాలు... రెగ్యులర్గా రావాల్సిన సమయానికే వచ్చాయి. జూన్ 1న అవి కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ అధికారులు చెప్పగా... అవి ఆల్రెడీ కేరళ తీరాన్ని ఇప్పటికే తాకేశాయని స్కై మేట్ అనే ఓ ప్రైవేట్ సంస్థ చెప్పింది. ప్రస్తుతం రుతుపవనాలు చాలా జోరుగా ఉన్నాయి. గాలులు బాగా వీస్తున్నాయి. దట్టమైన మేఘాల్ని వెంట తెస్తున్నాయి. కాబట్టి... ఈసారి మంచి వర్షాలు కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. (credit - twitter)
రుతుపవనాలు వస్తున్నాయని ఆనందపడాలో, ఏ కొంపలు మునుగుతాయోనని టెన్షన్ పడాలో తెలియని అయోమయంలో పడింది కేరళ ప్రభుత్వం. ఎందుకంటే... ఇటీవల సంవత్సరాల్లో ఇలాగే భారీ వర్షాలు వచ్చి... ఏకంగా వరదలు తప్పలేదు. ఈసారి టైముకి వచ్చేస్తున్న రుతుపవనాలు... ఎంత భారీ వర్షాలు కురిపిస్తాయోనని కేరళ ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. వాతావరణ అధికారులేమో... రుతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయని అంటుంటే... అది ప్రభుత్వానికి టెన్షన్ తెప్పిస్తోంది. అసలే కరోనా నుంచి బయటపడేందుకు నానా తిప్పలు పడుతున్న ఆ ప్రభుత్వానికి ఈ రుతుపవనాలు ఓ సవాలే అంటున్నారు. (credit - twitter)
ఇక తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు... ఓ వారం తర్వాత వస్తాయని అంటున్నారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో చిన్న అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయట. దాని కారణంగా... తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు వచ్చేందుకు చిన్నపాటి అడ్డంకులు ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఐతే... గతేడాది జూన్ 21న రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు వచ్చాయి. ఈసారి జూన్ మొదటి వారం తర్వాత వచ్చేలా ఉన్నాయి. అంటే ఆలస్యం చెయ్యకుండా త్వరగానే వస్తున్నాయని అనుకోవచ్చు. ఈసారి దేశం మొత్తం సాధారణ వర్షం పడుతుందని అంటున్నారు. అది రైతులకు శుభవార్తే. (credit - twitter)
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వేడి కాస్త తగ్గినప్పటికీ... రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ నుంచి వస్తున్న వేడి గాలుల వల్ల ఇంకా ఉక్కపోతలు తగ్గలేదు. పది రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది చనిపోతున్నారు. అటు ఉత్తర భారత్లో కూడా వేడి గాలులు కాస్త తగ్గి... అక్కడక్కడా జల్లులు కురుస్తున్నాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో వానల్లాంటి జల్లులు పడ్డాయి. అందుువల్ల ఓ వారం ఓపిక పడితే... ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వానలు కురుస్తాయని మనం అనుకోవచ్చు. (credit - twitter)