Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరి కొన్ని ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరి కొన్ని ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..
Special Trains: తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. జోన్ పరిధిలో మరో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా ఎఫెక్ట్ రైల్వేపై అధికంగా పడింది. దేశంలో లాక్ డౌన్ విధించిన సమయంలో రైళ్లను పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే అన్ లాక్ అనంతరం కొన్ని ప్రత్యేక రైళ్లను మాత్రమే అధికారులు నడుపుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
అయితే.. మొదట కేవలం కొన్ని రైళ్లను మాత్రమే నడిపిన అధికారులు క్రమంగా వాటి సంఖ్యను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
జోన్ పరిధిలో మరో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. సోమ, శుక్రవారాల్లో నడిచే కొల్హాపూర్-నాగ్‌పూర్ రైలు ఈ నెల 12 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ ట్రైన్ కొల్హాపూర్ నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటలకు నాగ్‌పూర్‌కు చేరుకుంటుందని తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
గురు, శనివారాల్లో నడిచే నాగ్‌పూర్-కొల్హాపూర్ రైలును ఈ నెల 13న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఈ ప్రత్యేక ట్రైన్ నాగ్‌పూర్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. ఈ ట్రైన్ కొల్హాపూర్‌కు మరుసటి రోజు మధ్యాహ్నం 2గంటలకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)