Home » photogallery » national »

SHAHEEN BAGH BULLDOZER UPDATES SC DECLINES TO STAY ANTI ENCROACHMENT DRIVE IN DELHI SHAHEEN BAGH HUGE PROTESTS MKS

Shaheen Bagh | Bulldozer : ఢిల్లీ షాహీన్‌బాగ్‌‌లో బుల్డోజర్లు.. కూల్చివేతకు స్థానికుల అడ్డు.. షాకిచ్చిన సుప్రీంకోర్టు

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బుల్డోజర్ కలకలం చోటుచేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనలకు కేంద్ర బిందువుగా నిలిచిన షాహీన్ బాగ్ ప్రాంతంలో బుల్డోజర్లు అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు సిద్ధపడగా, స్థానికుల నుంచి తీవ్ర నిరసన ఎదురై ఉద్రిక్తత ఏర్పడింది. ఈ వ్యవహారంలో జోక్యానికి నిరాకరిస్తూనే సరైన నోటీసులు ఇవ్వలేదంటూ బీజేపీ పాలిత ఎస్‌డీఎంసీని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. పూర్తి వివరాలివే..