Adeno Virus: ఒక్కరోజే ఏడుగురు చిన్నారులు మృతి..వణికిస్తున్న ఆ వైరస్..ఎక్కడంటే?
Adeno Virus: ఒక్కరోజే ఏడుగురు చిన్నారులు మృతి..వణికిస్తున్న ఆ వైరస్..ఎక్కడంటే?
కరోనా రక్కసి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం అనుకునే సమయంలో మరో కొత్త వైరస్ ఇప్పుడు ప్రజలను కలవరపెడుతుంది. ఈ వైరస్ పేరే అడెనో వైరస్. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ప్రజలను ఈ వైరస్ టెన్షన్ పెట్టిస్తుంది.
కరోనా రక్కసి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం అనుకునే సమయంలో మరో కొత్త వైరస్ ఇప్పుడు ప్రజలను కలవరపెడుతుంది. ఈ వైరస్ పేరే అడెనో వైరస్. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ప్రజలను ఈ వైరస్ టెన్షన్ పెట్టిస్తుంది.
2/ 8
ఈ వైరస్ ధాటికి అధిక సంఖ్యలో చిన్నపిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. అలాగే పేదవారిని కూడా ఈ వైరస్ వదిలిపెట్టడం లేదు. జనవరి నుండి క్రమంగా ఈ వైరస్ విజృంభిస్తుందని తెలుస్తుంది.
3/ 8
ఇక తాజాగా ఈ వైరస్ ద్వారా ఒక్కరోజులో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారని ప్రభుత్వం తెలిపింది.
4/ 8
ఇక ఇప్పటివరకు 5,213 కేసులు నమోదు కాగా 12 మంది చనిపోయారు. మొత్తం 121 ఆసుపత్రుల్లో 600 మంది వైద్యులతో పాటు 5 వేల పడకలను సిద్ధం చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.
5/ 8
ఈ వైరస్ బారిన పడ్డవారిలో జలుబు, జ్వరం, ఊపిరితిత్తుల సమస్య, నిమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయట. ఈ వైరస్ సోకిన వారు దగ్గడం, తుమ్మడం వల్ల ఇతరులకు వ్యాపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
6/ 8
అయితే ఈ వైరస్ గుండెసంబంధిత వ్యాధులు ఉన్నవారు, శ్వాసకోస సంబంధ వ్యాధులున్న వారు, కిడ్నీ సంబంధిత రోగులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఎక్కువ ప్రభావం చూపిస్తుందని సమాచారం.
7/ 8
స్వాబ్ టెస్ట్ ద్వారా ఈ వైరస్ ను గుర్తిస్తారు. ఈ వైరస్ సోకిన వారికి ప్రత్యేక చికిత్స ఏమిలేదు. లక్షణాలను బట్టి చికిత్స అందిస్తారు. అయితే ఈ వైరస్ సోకకుండానే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
8/ 8
బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే తరచూ ముక్కు, కళ్లను తాకకూడదని కరచాలనాలు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.