2. సరయూ ప్రాజెక్టులో కాలువ పొడవు 6,623 కిలోమీటర్లు. 14 లక్షల హెక్టార్లకు పైగా భూమికి సాగునీరు అందించనుంది. ఈ కాలువతో తొమ్మిది జిల్లాలకు చెందిన 29 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. బహ్రైచ్, శ్రావస్తి, గోండా, బలరాంపూర్, సిద్ధార్థనగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, గోరఖ్‌పూర్, మహారాజ్‌గంజ్ జిల్లాలు లబ్ధి పొందనున్నాయి. (Image: News18/Special Arrangement)
8. ఈ ప్రాజెక్టు ప్రారంభ సందర్బంగా డిసెంబర్ 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వీర యోధులందరికీ సంతాపాన్ని తెలుపుతున్నానని, భారతదేశపు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ మరణం ప్రతి దేశభక్తుడికి తీరని లోటు అని ప్రధాని మోదీ అన్నారు. ధైర్యవంతుడైన రావత్.. దేశ సాయుధ బలగాలను మరింత స్వావలంబనగా మార్చడానికి చాలా కష్టపడ్డారని, దానికి దేశమంతా సాక్షిగా నిలిచిందని ప్రధాని గుర్తుచేశారు.. (Image: News18/Special Arrangement)