‘రెండు వేల రూపాయల నోట్లను కూడా రద్దు చేస్తారా?‘ అన్నదే నోట్ల రద్దు తర్వాత సామాన్య జనంలో కలుగుతున్న అతి పెద్ద సందేహం. ఇప్పటికే రెండు వేల రూపాయల నోట్ల వాడకం చాలా చోట్ల తగ్గిపోయింది. పెద్ద నోట్ల రద్దులో భాగంగా త్వరలో ఈ 2000 నోటును కూడా రద్దు చేస్తానన్న ప్రచారం కూడా చాలా సార్లు ప్రముఖంగా జరిగింది.
2/ 7
సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ ఇదే వార్త ఎన్నోసార్లు సర్క్యులేట్ అయింది. అయితే ఇవన్నీ అవాస్తవ వార్తలేనని అప్పటికప్పుడు ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేయడం చేస్తూ వస్తున్నారు. అయితే అసలు రెండు వేల నోటు విషయంలో ఏం జరుగుతోంది.?
3/ 7
కేంద్రం మదిలో ఎలాంటి ఆలోచన ఉంది? అన్నది సోమవారం పార్లమెంట్ సాక్షిగా బయటపడింది. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పార్లమెంట్ లో ఓ కీలక ప్రకటన చేశారు.
4/ 7
‘రెండు వేల రూపాయల నోట్లను రెండేళ్ల నుంచే ముద్రించడం ఆపేశాం. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చర్చించి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే మార్కెట్లో ఈ రెండు వేల నోట్ల సంఖ్య బాగానే తగ్గింది‘ కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్లో లిఖిత పూర్వకంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
5/ 7
2019వ సంవత్సరం నుంచే ఒక్క రెండు వేల రూపాయల నోటును కూడా ముద్రించలేదని ఆయన స్పష్టం చేశారు. అత్యధిక విలువ కలిగిన నోటు సర్క్యులేషన్ ను తగ్గించగలిగితే నల్లధనాన్ని తగ్గించొచ్చని కేంద్రం భావనగా తెలుస్తోంది.
6/ 7
2018 వ సంవత్సరం మార్చి 30వ తారీఖు వరకు దేశంలో 3362 మిలియన్ల రెండు వేల నోట్లు చెలామణిలో ఉన్నట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆ ప్రకటనలో తెలిపారు. 2019వ సంవత్సరం ఫిబ్రవరి 26 నాటికి ఆ సంఖ్య 2499 మిలియన్లకు చేరుకుందన్నారు.
7/ 7
దీంతో 2000 వేల నోటుపై ఉన్న సందేహాలను కేంద్ర ప్రభుత్వం తీర్చినట్టయింది. రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదనీ, కాకపోతే వాటి వినియోగాన్ని మాత్రం తగ్గించేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.