రామ్ చరణ్ కెరీర్లో 2022 వెరీ వెరీ స్పెషల్‌గా నిలిచిపోయిందని ఇప్పటికీ మెగాభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. రామ్ చరణ్ ఇన్నేళ్ల కెరీర్లో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్. అంతేకాదు ఇన్నేళ్ల రామ్ చరణ్ ఫిల్మ్ కెరీర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు. అందుకే గతేడాది 2022 రామ్ చరణ్ కెరీర్లో వెరీ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. (Twitter/Photo)
రామ్ చరణ్ విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘చిరుత’ మూవీతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్డాడు. ఆ తర్వాత ‘మగధీర’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. 2007లో టాలీవుడ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఆ తర్వాత ఒకే యేడాదిలో రెండు సినిమాలు మాత్రం రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. (Twitter/Photo)
ఐతే.. రామ్ చరణ్ హీరోగా కెరీర్ మొదలు పెట్టాకా.. 2008, 2011,2020,2021 కాలెండర్ ఇయర్స్‌లో రామ్ చరణ్ నటించిన సినిమాలేవి విడుదల కాలేదు. మరోవైపు 2017లో కూడా చరణ్ హీరోగా నటించిన సినిమా విడుదల కాలేదు. కానీ తన తండ్రి చిరంజీవి హీరోగా రామ్ చరణ్.. నిర్మిస్తూ తెరకెక్కించిన ‘ఖైదీ నెంబర్ 150’లో ఓ పాటలో అతిథి పాత్రలో మెరిసాడు. (Ram Charan RRR Photo : Twitter)
కానీ ఇప్పటి వరకు ఒకే కాలండర్ ఇయర్లో రెండు సినిమాలు విడుదల చేసిన దాఖలాలు మాత్రం లేవు. కానీ 2021లో మాత్రం రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు విడుదల అవుతాయని ఆయన అభిమానులు ఆశించారు. కానీ కరోనా వారి ఆశలపై నీళ్లు చల్లింది. కానీ 2022లో మాత్రం రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు ఒకే కాలండర్ ఇయర్లో విడుదల అయ్యాయి. అందులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో హిట్ అందుకోవడంతో పాటు ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో జంజీర్ సినిమాతో బాలీవుడ్లో విమర్శల పాలైన చరణ్.. ఆర్ఆర్ఆర్ తో నటుడిగా విమర్శకులు ప్రశంసలు అందుకున్నారు. (Twitter/Photo)
ఇక తన తండ్రి చిరంజీవితో పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్న ‘ఆచార్య’ చిత్రం గతేడాది ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా కథ, కథనం అంతా పేలవంగా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఏది ఏమైనా ఈ రకంగా ఒకే కాలండర్ ఇయర్లో రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు విడుదల కావడం అనేది ఇదే మొదటిసారి. అంతేకాదు తన తండ్రితో పూర్తి స్థాయిలో నటించిన సంతృప్తి రామ్ చరణ్‌కు మిగిల్చింది. (Twitter/Photo)
ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంతో పాటు తండ్రి మెగాస్టార్ చిరంజీవితో పూర్తి స్థాయిలో నటించాలనే కోరిక కూడా ‘ఆచార్య’ సినిమాతో నెరవేరింది. మరోవైపు రామ్ చరణ్ తన కెరీర్లో మొదటిసారి ఓ డైరెక్టర్ దర్శకత్వంలో రెండోసారి నటించాడు. అది రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ కావడం విశేషం. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అదరగొట్టాడు చరణ్. అంతేకాదు తన కెరీర్లో ‘జంజీర్ (తుపాన్), ధృవ’ సినిమాల తర్వాత ఈ సినిమాలో ఖాకీ డ్రెస్ వేసుకోవడం విశేషం. మొదటిసారి కలిసి రాని పాత్రలో మిగతా రెండు సార్లు మాత్రం వర్కౌట్ కావడం విశేషం.
రామ్ చరణ్.. మిగిలిన హీరోలతో పోలిస్తే.. సోషల్ మీడియాలో లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్గా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇవ్వక ముందు.. తన మూవీకి సంబంధించిన విషయాలను ఫేస్బుక్లో షేర్ చేసుకునే వారు. లేకపోతే.. తన భార్య ఉపాసనకు సంబంధించిన సోషల్ మీడియా పేజ్‌లో తనకు సంబంధించిన విషయాలను పంచుకునేవారు. జూలై 8న 2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఒకటిన్నర యేడాదిలో ఈయన ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య 5 లక్షలు క్రాస్ అయింది.
అంతేకాదు గతేడాది యేడాది.. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించింది. మరోవైపు ఓ మీడియా సంస్ధ ఆర్ఆర్ఆర్తో ఫేమసైన రామ్ చరణ్‌ను ట్రూ లెజండ్ అవార్డుతో గౌరవించింది. ఏ రకంగా చూసుకున్న 2022లో ఒకే కాలంటర్ ఇయర్లో రెండు సినిమాలు విడుదల చేయడమే కాకుండా.. అందులో ఒక సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారడం.. మరోవైపు వరుసగా అవార్డులు అందుకోవడం విశేషం అని చెప్పాలి. ఇక రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఏ హీరో శంకర్ దర్శకత్వంలో నటించలేదు. ఈ రకంగా ఓ రికార్డు క్రియేట్ చేసాడనే చెప్పాలి. (Twitter/Photo)