RAJASTHAN EIGHT PEOPLE DIED AFTER THEIR CAR FELL OFF CHHOTI PULIYA AND INTO THE CHAMBAL RIVER IN KOTA SK
Kota Accident: పెళ్లిలో ఊహించని ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన కారు.. వరుడు సహా 9 మంది దుర్మరణం
Rajasthan Car Accident: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు.
రాజస్థాన్లోని కోటా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి చంబల్ నదిలోకి దూసుకెళ్లింది. కారు పూర్తిగా నీటి మునగడంతో అందులో ఉన్న 9 మంది మరణించారు.
2/ 5
చోటీ పులియా సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. (Image:ANI)
3/ 5
క్రేన్ సాయంతో నది నుంచి కారును బయటకు తీశారు. కారులోనే తొమ్మిది మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన వారిలో పెళ్లి కుమారుడు కూడా ఉన్నాడు. (Image:ANI)
4/ 5
వరుడిని పెళ్లి మంటపానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి కుమారుడు సహా 9 మంది చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. (Image:ANI)
5/ 5
మృతదేహాలను పోస్టుమార్టం కోసం కోటా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. (Image:ANI)