RAHUL GANDHI FILES NOMINATION FROM AMETHI FACING COMPETITION FROM BJP LEADER SMRITI IRANI IN UTTAR PRADESH AK
అమేథీలో రాహుల్ గాంధీ వర్సెస్ స్మృతి ఇరానీ
కాంగ్రెస్ కంచుకోట, తన సిట్టింగ్ స్థానమైన అమేథీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీపై గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ... మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడితో పోటీ పడుతున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సిట్టింగ్ స్థానమైన అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తల్లి సోనియాగాంధీతో పాటు చెల్లెలు ప్రియాంక గాంధీ ఫ్యామిలీ రాహుల్ గాంధీ వెంట నామినేషన్ దాఖలు కార్యక్రమానికి వచ్చారు.
2/ 8
ఈ సారి రెండు అమేథీతో పాటు మరో స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు... అమేథీ కంటే ముందు కేరళలోని వయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసి బరిలో నిలిచారు.
3/ 8
దక్షిణ ప్రజలు తాము ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వాములం కావడం లేదని భావిస్తున్నారని... అందుకే తాను దక్షిణాది నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
4/ 8
మరోవైపు రాహుల్ గాంధీకి పోటీగా అమేథీ నుంచి బరిలోకి దిగుతున్న కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ... ఈ విషయంలో ఆయనను టార్గెట్ చేశారు.
5/ 8
కాంగ్రెస్ కంచుకోట, తన సిట్టింగ్ స్థానమైన అమేథీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీపై గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ... మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడితో పోటీ పడుతున్నారు.
6/ 8
గత ఎన్నికల్లోనూ అమేథీలో రాహుల్ గాంధీపై పోటీ చేసిన స్మృతి ఇరానీ... అమేథీని రాహుల్ కంటే తానే ఎక్కువగా అభివృద్ధి చేయగలనని చెబుతున్నారు. ఈ సారి అమేథీ నుంచి తాను కచ్చితంగా గెలుస్తానని అన్నారు.
7/ 8
అమేథీతో పాటు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌లోనూ ప్రచారం చేసి ఆయనను ఓడిస్తామని స్మృతి ఇరానీ ప్రకటించారు.
8/ 8
అమేథీలో ఎస్పీ, బీఎస్పీ పోటీలో లేకపోవడంతో... ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే నెలకొంది.