Puri Ratha Yatra 2022: ఒడిశా పూరీలో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల కోలాహలం మధ్య రథాలు ముందుకు కదిలాయి.
పూరీలో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల కోలాహలం మధ్య రథాలు ముందుకు కదిలాయి.
2/ 8
కరోనా కరణంగా గత రెండేళ్లు రథయాత్ర వేడుకలను నిర్వహించలేదు. ఈసారి కరోనా తగ్గుముఖం పట్టడంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు కూడా లక్షల్లో తరలి వస్తున్నారు.
3/ 8
జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు తమ రథాల్లో ఇవాళ గుండిచా మందిరానికి బయలుదేరి వెళ్లారు. పూరీ మహారాజు దివ్యసింగ్ దేవ్ మూడు రథాల ముందు భాగాల్లో బంగారం చీపురుతో ఊడ్చారు.అనంతరం రథాలు ముందుకు కదిలాయి.
4/ 8
పూరీ.. ఈ ముగ్గురు దేవుళ్ల జన్మ క్షేత్రం. ఐతే వారిన పెంచిన తల్లి గుండిచా మహారాణి కోరిక మేరకు ప్రతి ఏటా 9 రోజుల పాటు గుండిచా ఆలయానికి విడికి వెళ్తుంటారు. ఈ సందర్భంగా రథయాత్రను ఘనంగా నిర్వహిస్తారు.
5/ 8
జగన్నాథుని రథాన్ని నందిఘోష్ అంటారు. దీని ఎత్తు 45.6 అడుగులు. బలరాముడి రథం పేరు తాళ ధ్వజ. దీని ఎత్తు 45 అడుగులు. సుభద్ర రథం దర్పదలన్ ఎత్తు 44.6 అడుగుల ఎత్తు ఉంటుంది.
6/ 8
జ్యేష్ఠ పూర్ణిమ రోజున జగన్నాథుడికి.. సోదరి సుభద్ర, అన్నయ్య బలభద్రలు పుణ్యస్నానం చేస్తారు. తర్వాత ముగ్గురినీ ఆలయ గర్భగుడిలో ఉంచుతారు. రెండో రోజు నుంచి గర్భగుడి తలుపులు మూసేస్తారు. అనంతరం జగన్నాథుడు రథంపై బయల్దేరి భక్తులకు దర్శనం ఇస్తారు.
7/ 8
పవిత్రమైన రథయాత్రలో పాల్గొనడానికి మన దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివస్తారు. ఈ రథయాత్రలో పాల్గొంటే 100 యాగాలు చేసిన ఫలితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. రథయాత్రతో పాటు గుండిచా నగరానికి వెళితే జీవన్మరణ చక్రం నుండి విముక్తి పొందుతారట.
8/ 8
రథయాత్ర జూలై 12న ముగుస్తుంది. యాత్ర అంతా ప్రశాంతంగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.