Punjab CM Bhagwant Mann Wedding: రెండో పెళ్లి చేసుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. ఫొటోలు వైరల్
Punjab CM Bhagwant Mann Wedding: రెండో పెళ్లి చేసుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. ఫొటోలు వైరల్
Punjab CM Bhagwant Mann Wedding: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో వివాహం చేసుకున్నారు. చండీగఢ్‌లోని ఓ గురుద్వారాలో అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి జరిగింది. ఆ ఫొటోలను ఇక్కడ చూద్దాం.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ని ఆయన వివాహం చేసుకున్నారు. ఛండీగఢ్‌లోని గురుద్వారాలో నిరాడంబరంగా జరిగింది. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షలో వివాహ వేడుక జరిగింది.
2/ 7
పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న సీఎం భగవంత్ మాన్, గురుప్రీత్ కౌర్ ఫోటోలను ఆప్ నేత రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సీఎం భగవంత్ మాన్ బంగారు రంగు దుస్తులు, పసుపు రంగు టర్బన్ ధరించగా.. గురుప్రీత్ ఎరుపు రంగు లెహెంగాను ధరించారు.
3/ 7
భగవంత్‌మాన్ వివాహం సిక్కుల సంప్రదాయం ప్రకారం జరిగింది. ఆయన తల్లి, సోదరి, అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర పార్టీ నేతలు భగవంత్ మాన్ వివాహ వేడుకకు హాజరయ్యారు.
4/ 7
భగవంత్ మాన్ ఆరు సంవత్సరాల క్రితం తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఆయన మొదటి భార్య, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. భగవంత్ మాన్ పిల్లలిద్దరూ ఇటీవల ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కార్యక్రమానికి వచ్చారు.
5/ 7
2014 లోక్‌సభ ఎన్నికల్లో భగవంత్ మాన్ మొదటి భార్య ఇంద్రప్రీత్ కౌర్ కూడా ఆయనతో కలిసి ప్రచారం చేశారు. తాజాగా తన తల్లి, సోదరి స్వయంగా ఎంపిక చేసిన డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను భగవంత్ మాన్ వివాహం చేసుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
6/ 7
భగవంత్ మాన్ హాస్యనటుడిగా తన వృత్తిని ప్రారంభించారు. 2008లో కపిల్ శర్మతో కలిసి 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్' అనే టీవీ షోలో పాల్గొన్నారు. ఆ తర్వాత భగవంత్ మాన్కు మంచి పాపులారిటీ వచ్చింది. కచారి సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన భగవంత్ మాన్ 12 చిత్రాలకు పైగా పనిచేశారు
7/ 7
భగవంత్ మాన్ 2014లో తొలిసారిగా సంగ్రూర్ నుంచి ఎంపీ అయ్యారు.2019 ఎన్నికల్లో కూడా భగవంత్ మాన్ సంగ్రూర్ నుంచి గెలిచి వరుసగా రెండోసారి లోక్‌సభకు వెళ్లారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమాద్మీ విజయం సాధించడంతో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. (Image:ANI)