సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్ అధ్యక్షతన శుక్రవారం రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక కృషి జరిగిందని సీఎం తెలిపారు. ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులను ఈ నెల 15 తర్వాత సెలవుపై పంపిస్తామని సీఎం స్పష్టంచేశారు. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకునే వరకు వారు సెలవుపై ఉండాల్సి వస్తుందన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)