Pune:వంద కేజీల వెజ్ ఐస్ కేక్‌కి వరల్డ్ రికార్డ్..ఆమె చేతిలో మాములు ఆర్ట్ లేదంటే నమ్మండి
Pune:వంద కేజీల వెజ్ ఐస్ కేక్‌కి వరల్డ్ రికార్డ్..ఆమె చేతిలో మాములు ఆర్ట్ లేదంటే నమ్మండి
Prachi Dhabaldeb: భారీ కేక్‌ని డిజైన్ చేసిన ఆర్టిస్ట్‌గా పూణెకి చెందిన ప్రాచి ధబల్దేబ్కి రెండు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టైటిల్స్ దక్కాయి. ఒకటి భారీ సైజ్ శాకహార కేక్‌ను డిజైన్ చేయడంతో పాటు ఎక్కువ సంఖ్యలో వెజిటెబుల్ ఐస్ కేక్స్ రూపొందించినందుకు ఈ అవార్డులు అందుకున్నారు ప్రాచి ధబల్దేబ్.
వండర్స్ క్రియేట్ చేయాలంటే సాహసాలే చేయనవసరం లేదు. చేస్తున్న వృత్తినే కాస్త క్రియేటివ్‌గా చేస్తే రావల్సిన గుర్తింపే కాదు..కావల్సినంత పేరు, ప్రతిష్టలు వస్తాయి. ఇందుకు పూణెలోని కేక్ ఆర్టిస్ట్ ప్రాచీ ధబల్దేబ్ని ఎగ్జామ్స్పుల్గా చెప్పుకోవచ్చు.
2/ 9
కేక్ ఆర్టిస్ట్‌గా అతి పెద్ద ఐస్ కేక్ తయారు చేసి రెండు సార్లు ప్రపంచ రికార్డ్‌ను దక్కించుకుంది పూణె బేకర్‌కి చెందిన కేక్ ఆర్టిస్ట్ ప్రాచీ ధబల్దేబ్. బిగ్ కేక్ మేకింగ్‌లో రెండు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ టైటిల్స్ చేజిక్కించుకొని ఒక అచీవ్మెంట్ సాధించిన మహిళగా ప్రాచీ నిలిచారు.
3/ 9
100కేజీల బరువు కలిగిన వెజిటెబుల్ ఐక్ కేక్‌ని తయారు చేశారు ప్రాచీ ధబల్దేబ్. రాయల్ ఐసింగ్ నిర్మాణంగా చేపట్టిన అతిపెద్ద కేక్ ఖ్యాతి లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరడం గొప్ప విజయంగా భావిస్తున్నట్లు ప్రాచీ ధబల్దేబ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు.
4/ 9
ఈ వరల్డ్ రికార్డ్‌తో పాటు డెబ్ మరొక టైటిల్‌ను కూడా గెలుచుకున్నారు ప్రాచీ: మొదటిది అతిపెద్ద కేక్ నిర్మాణం అయితే రెండోవది ఎక్కువ శాకాహార ఐక్ కేక్స్ తయారు చేసిన ఆర్టిస్ట్‌గా తనకు గుర్తింపు లభించిందని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
5/ 9
రెండు ప్రపంచ రికార్డ్ టైటిళ్లను గెలుచుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. అతిపెద్ద రాయల్ ఐస్ కేక్ నిర్మాణానికి సంబంధించిన పొడవు, వెడల్పుతో పాటు థిక్‌నెస్‌తో పాటు కేక్ కొలతల్ని వివరించారు ప్రాచీ ధబల్దేబ్.
6/ 9
వరల్డ్ రికార్డ్ దక్కించుకున్న భారీ కేక్ 6 అడుగులు, 4 అంగుళాల పొడవు, 4 అడుగులు, 6 అంగుళాల పొడవు మరియు 3 అడుగుల 5 అంగుళాల వెడల్పుతో ఉందని ఆమె పేర్కొంది.
7/ 9
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం డెబ్ గుడ్డు ఉపయోగించకుండా అతి చిన్న, అతి పెద్ద కేకులను చేతితో తయారు చేయడంలో ఎంతో నేర్పరిగా గుర్తింపు లభించింది. అంతే కాదు ప్రాచీ ధబల్దేబ్ రాయల్ ఐసింగ్ కేక్ రాణిగా పిలవచ్చని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అభిప్రాయపడింది.
8/ 9
డెబ్ ప్రాచీ ధబల్దేబ్ రాయల్ ఐసింగ్ కేక్ ఆర్ట్‌లో ప్రత్యేకత కలిగి ఉన్నారు. రాయల్ ఐసింగ్ కేక్ రూపొందించడం ఓ సవాల్‌గా తీసుకున్నారు. అందుకే తన టాలెంట్‌కు తగిన గుర్తింపు దక్కిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
9/ 9
కేక్ ఆర్టిస్ట్‌గా ప్రాచి ధబల్దేబ్కి వచ్చిన గుర్తింపుపై ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన రాయల్ ఐసింగ్ కేక్‌ని చూస్తూ మాకు టేస్ట్ చూపించరా అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.